Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను మరీ అంత లైట్ తీసుకుంటున్నారే
By: Tupaki Desk | 21 July 2016 1:46 PM GMTతిరుగులేని పవర్ తో చెలరేగిపోతున్న తెలంగాణ సర్కారును విమర్శలు చేయాలంటే రాజకీయ నేతలు సైతం తొంరదపడని పరిస్థితి. ఇక.. మీడియా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వేళ.. ప్రభుత్వాధినేతలుగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎంత పవర్ ఫుల్ గా ఉండాలి. అదేం చిత్రమో.. కొరకరాని కొయ్యిలా ఉండే మీడియా సైతం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వేళ.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా.. భయం భక్తి అన్నవి బొత్తిగా లేనట్లుగా వ్యవహరించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కొద్ది వారాలుగా హైదరాబాద్ మహానగర రోడ్ల దుస్థితి మీద స్పెషల్ గా ఫోకస్ చేసిన మంత్రి కేటీఆర్.. పరిస్థితి వెంటనే మారాలని ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ లాంటి పవర్ ఫుల్ నేత నోటి నుంచి ఆదేశాలు వచ్చినంతనే వాయువేగంతో పనులు జరిగిపోతాయని.. హైదరాబాద్ రోడ్ల స్వరూపమే మారిపోతుందని ఫీలయ్యారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి మార్పు లేకపోవటం ఒక ఎత్తు అయితే.. కాలం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ పరిస్థితి దారుణంగా మారుతున్న దుస్థితి.
ఆ మధ్యన పగటిపూటే ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. రోడ్ల దుస్థితి మీద భారీ సమీక్షను నిర్వహించిన కేటీఆర్.. ఆ తర్వాత రాత్రివేళ రోడ్లను చూసి.. మరీ అధ్వానంగా ఉన్నాయంటూ ఫీలైన పరిస్థితి. హైదరాబాద్ రోడ్ల విషయంలో సీఎం నుంచి సామాన్యుడు వరకూ అందరూ అసంతృప్తితో ఉన్నారని.. వెంటనే పరిస్థితుల్లో మార్పులు రావాలని ఆయన అధికార స్వరంతో ఆదేశాలు జారీ చేశారు. ఇది జరిగి దాదాపు ఐదారు రోజులు గడుస్తున్న వేళ.. మరోసారి రోడ్ల పరిస్థితుల మీద సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా గ్రేటర్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. అన్ని విభాగాధిపతులు వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితిలో మార్పు రాకుంటే ఎంతటి పెద్ద స్థానంలో ఉన్నా చర్యలు తప్పవని మండిపడ్డారు. ఈ మండిపాట్లు.. ఆగ్రహాలతో ఎలాంటి పని జరగదన్న విషయం కేటీఆర్ కు ఇప్పటికే అర్థమై ఉండాలి. కానీ.. సీన్ చూస్తుంటే అలాంటిదేమీ కేటీఆర్ కు అర్థమైనట్లుగా లేదు. మాట్లాడటం ఆపేసి.. తమదైన శైలిలో ప్రకాళన మొదలెడితే కానీ.. అధికారుల పనితీరులో మార్పు రాదన్న విషయాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.