Begin typing your search above and press return to search.
కేటీఆర్..నువ్వు సూపరో సూపర్
By: Tupaki Desk | 13 Jan 2016 5:37 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ - పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తండ్రిని మించిన తనయుడు అవుతున్నాడు. రాజకీయాల్లో కేసీఆర్ బలం మాటలే. ఆ మాటలు కోటలు దాటుతాయని ఆయన విమర్శకులు అంటుంటారు. కాదు వాస్తవాలను వ్యంగ్యంగా చెప్తారని మద్దతుదారులు అంటుంటారు. మొత్తంగా కేసీఆర్ తిమ్మిని బమ్మి చేసైనా తన మాటకే మొగ్గు చూపేలా చేసుకోగలరు. అలాంటి కేసీఆర్ కంటే ఆయన తనయుడు కేటీఆర్ రెండాకులు ఎక్కువే చదివినట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికలను కేటీఆర్ భుజాన వేసుకున్న నేపథ్యంలో ఆయనతో పలు వేదికలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సెటిలర్లు, సీమాంధ్రుల విషయంలో తమకు ఎదురవుతున్న ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారు. గతంలో సీమాంధ్రులపై కేసీఆర్ ఆండ్ టీం తీవ్ర విమర్శలు చేసింది. మరి ఇప్పుడు? వారి కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్తోంది. ఇంత మార్పు కేవలం ఓట్ల కోసమే అని విపక్షాలు అంటుంటే కేటీఆర్ మాత్రం కొత్త విశ్లేషణ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోణంలోనే తమ మాటలు, ఆచరణలు ఉంటున్నాయని స్పష్టం చేశారు.
"తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కొందరు సమైక్యాంధ్రవాదులు తెలంగాణ ప్రజానీకాన్ని, టీఆర్ ఎస్ ను విమర్శించారు.. వాటికి ప్రతిస్పందనగానే మేము మాట్లాడాల్సి వచ్చింది. పరిపాలకులుగా ఉన్నవారు అన్ని వర్గాల ప్రజలను గమనంలోకి తీసుకోవాలి. అందరి సంక్షేమం కోసం నిర్ణయాలు, చర్యలు ఉండాలి. ఈ కోణంలోనే టీఆర్ ఎస్ వ్యవహరిస్తోంది. మాకు ఎవరిపై ద్వేషాలు లేవు" అంటూ ఒక్క మాటలో తేల్చేశారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉండే వారి గురించి కేటీఆర్ తన నిర్వచనాన్ని మార్చేశారు.హైదరాబాద్ లో ఉండే వారంతా హైదరాబాదీలేనని పేర్కొంటూ ఇక్కడ సెటిలర్లు ఎవరూ లేరని చెప్పారు. ఆ మాటకొస్తే తానూ సెటిలర్‌నేనని...తమ సొంత ఊరు సిద్ధిపేట అని గుర్తు చేశారు.
తన కంటే బాగా మార్పును, మాటలను సమర్థించుకుంటున్న కేటీఆర్ తీరును చూస్తే ఆయన తండ్రి కేసీఆర్‌కు కూడా ఒకింత జెలసీ కలుగుతుందేమోనని రాజకీయ వర్గాలు సరదాగా చర్చించుకుంటున్నాయి.