Begin typing your search above and press return to search.
ఉడికిపోయే కేటీఆర్ నోట ‘గుండు’ సంజయ్ అనేయటమా?
By: Tupaki Desk | 12 Oct 2022 5:05 AM GMTతాము టార్గెట్ చేసే ప్రత్యర్థులను ఉద్దేశించి ఎంత మాట అనేయటానికి వెనుకాడని నేతల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఉంటాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తమను ఉద్దేశించి ఎవరూ ఏమీ అనకూడదన్నట్లుగా ఉండే వీరి తీరు.. వారు మాత్రం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటమా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.
బాడీ షేమింగ్ గురించి అప్పుడప్పుడు భావోద్వేగంతో ఫీలయ్యే మంత్రి కేటీఆర్ లాంటి వారు.. తనను.. తన తండ్రిని మాటలతో ఉతికి ఆరేసే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రాజకీయంగా సవాలచ్చ అనుకోవటం తప్పేం కాదు. అందుకు భిన్నంగా మనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాల మీద మాట్లాడటంపైనే అభ్యంతరమంతా. పొడుగు.. పొట్టి.. లావు.. సన్నం.. బట్టతల లాంటివి మనం చేసుకునేదేమీ ఉండదు.
అలాంటి వాటిని ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు చేయటం ఎంతవరకు మర్యాద? అన్నది ప్రశ్న. ఒకవైపు తాము తోపుల్లాంటి రాజకీయ అధినేతల్ని ఎదుర్కొని వచ్చామని గొప్పలు చెప్పుకుంటూ.. ఇప్పటి తమ రాజకీయ ప్రత్యర్థులు బఫూన్లు అంటూ విరుచుకుపడటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
వైఎస్.. చంద్రబాబు లాంటి వారిని విమర్శించే వేళలో తమ స్థాయిని గుర్తుకు తెచ్చుకోని కేటీఆర్.. ఇప్పుడు తమను విమర్శించే వారిని.. వేలెత్తి చూపించే వారిని మాత్రం.. వారి స్థాయి ఎంత? అని ప్రశ్నించటం అహంకారం కాదా? అన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో బండి సంజయ్ ను ఉద్దేశించి.. ఆయన బట్టనెత్తిని ఉద్దేశించి గుండు సంజయ్ అంటూ ఎటకారం ఆడేయటం సరైన పద్దతా? అని ప్రశ్నిస్తున్నారు.
రూపురేఖల గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే.. ఇట్టే ఫీలై.. గుండెలు బాదుకునే కేటీఆర్ లాంటి నేత.. అందుకు భిన్నంగా తాను మాత్రం ఏమైనా అనేయొచ్చన్నట్లుగా మాట్లాడటంలో అర్థం ఉందా? అన్నది ఆలోచించుకోవాలి. గుండు సంజయ్ అన్న మాటను చూస్తే.. బట్టనెత్తి ఉన్న వారందరూ ఫీలయ్యేలా మాటలేంది? అన్న ప్రశ్న వినిపిస్తోంది. బట్టనెత్తి కావాలని తెచ్చుకునేది కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా కేటీఆర్ ఏం టార్గెట్ చేయదల్చుకున్నారు? అన్నది క్లారిటీ ఇస్తే మరింత బాగుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.