Begin typing your search above and press return to search.
తెలంగాణ జర్నలిస్టులకు సర్కారు షాక్
By: Tupaki Desk | 22 March 2016 7:01 AM GMTతెలంగాణ ఉద్యమం గురించి ఏదైనా చర్చ వస్తే.. మిగిలిన వర్గాలు ఎంతగా ప్రయత్నించాయో.. అంతకు రెట్టింపు బాధ్యతను.. బరువును మోసింది తెలంగాణ జర్నలిస్టులే. అరవైఏళ్ల ఉద్యమాన్ని ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చాలామంది పేర్లు పైకి వినిపించినా.. దాని వెనుకున్నది తెలంగాణ జర్నలిస్టులేనన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మమేకం కావటమే కాదు.. తెలంగాణ సాధన ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదని తేల్చుకొని.. అందుకోసం ఎంతవరకైనా పోరాడదామన్నట్లుగా వ్యవహరించిన తెలంగాణ జర్నలిస్టుల కృషి చాలా తక్కువగానే బయటకు వచ్చిందని చెప్పక తప్పదు.
ఉద్యమంలో వారు పోషించిన కీలకపాత్రను.. రాజకీయ నాయకులు.. ఉద్యమ నేతలు తమ క్రెడిట్ కింద తీసుకున్నా.. తమకు లక్ష్యం మాత్రమే తప్ప పేరు ప్రఖ్యాతులు అస్సలే అక్కర్లదేని ఫీలైన వారు తెలంగాణ జర్నలిస్టులు. అందుకే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పేరును ప్రస్తావిస్తుంటారు. వారి కృషిని గుర్తు చేస్తుంటారు.
తెలంగాణ కోసం అంతగా పోరాడిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం చాలానే చేస్తుందని మాటలు చెప్పినా.. చేతల్లో ఇప్పటివరకూ ఏమీ చేసింది లేదన్న విషయం తెలిసిందే. ఈ మధ్యన తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి.. రూ.5లక్షల బీమా అంటే చాలామంది సంతోషపడిపోయారు.
తమ రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవంగా వారు పొంగిపోయారు. అయితే.. అవసరం వచ్చి అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే.. ఆ కార్డులు పని చేయటం లేదన్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది చెప్పటం కనిపిస్తుంది. తెలంగాణ కోసం ఎంతో కష్టపడిన జర్నలిస్టులకు దక్కిన గౌరవం ఇదేనా? అని ఫీలైన వారు చాలామందే ఉన్నారు. పదవులు కోరుకోకున్నా.. కుటుంబ సభ్యులకు ఆరోగ్య కష్టం వస్తే ప్రభుత్వం తమను ఆదుకుంటుందని భావించినా.. అది అరకొరగా ఉండటం వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక బండి లాగిస్తున్న పరిస్థితుల్లో.. తాజాగా తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ ఒక ప్రశ్న సంధించారు.
జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేయని మాట వాస్తవమేనా? అని ఆయన ప్రశ్న సంధిస్తే.. నిజమేనని చెప్పుకొచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెండు నెలల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో సమావేశాన్ని నిర్వహించి.. ఈ అంశంపై స్పష్టత ఇస్తామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు (కేసీఆర్ పలుమార్లు ట్రిఫుల్ బెడ్రూం అన్నట్లుగా చెప్పారు) లాంటివి త్వరలో అందించే పథకాల గురించి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ జర్నలిస్టులకు ఏదేదో చేయకున్నా.. కనీసం ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించే పుణ్యం కట్టుకుంటే చాలు. తెలంగాణ సాధన కోసం ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పని చేసిన తెలంగాణ జర్నలిస్టులకు ఇప్పటివరకూ కార్పొరేట్ వైద్యం కూడా అందని వైనానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది?