Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ టార్గెట్ ఓకే.. ఇంతకూ ఎలా వర్కువుట్ చేస్తారు కేటీఆర్?
By: Tupaki Desk | 29 May 2021 4:30 AM GMTమాటలకేముంది.. ఎన్నైనా చెప్పొచ్చు. కానీ.. చెప్పిన మాటల్ని పూర్తి చేసేదెలా అన్నదే కీలకం. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్నే తీసుకోండి. బడాయి అన్నట్లుగా ఆయన ఘనమైన ప్రకటన చేసేశారు. ఈ ఏడాది చివరి నాటికి వంద శాతం టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్న మాట చెప్పేశారు. ఇందుకోసం కోటి వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవనున్నట్లు చెప్పారు. నిజానికి గ్లోబల్ టెండర్ల మాట ఇప్పటిది కాదు. ఈ నెల మొదటి నుంచి ఆయన నోట అలాంటి మాటే వస్తోంది.
మరి.. నెల వ్యవధిలో గ్లోబల్ టెండర్లకు సంబంధించి ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పకుండా.. అదే పనిగా గ్లోబల్ టెండర్ల మాటకు తాజాగా కోటి వ్యాక్సిన్ల కొనుగోలు చేస్తామని చెప్పటం.. వినటానికి బాగుంది. మరి.. ఏలా సాధ్యమన్న సమాధానాన్ని చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీదనే ఉంది. ఎంత ధరైనా సరే.. ఓకే అన్నట్లుగా ప్రభుత్వం తీరు లేదన్న విషయం కేటీఆర్ మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
వ్యాక్సిన్ కొనుగోలుకు చూస్తే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల ధరల విషయంలో తీవ్రమైన వ్యత్యాసం ఉందన్న ఆయన.. టీకాలు తయారు చేసే కంపెనీలు.. ప్రైవేటు వారికి అమ్ముకునేందుకు ఇష్టపడుతున్నారన్న మాటను చెప్పటమే ఇందుకు నిదర్శనం. వ్యాక్సిన్ కొనుగోలులో రాష్ట్రాల పాత్ర లేకుండా చేయటం ఇబ్బందికరంగా మారిందన్న ఆయన మాటల్ని చూస్తే.. కొందామని అనుకున్నా.. అదెంత వరకు వర్కువుట్ అవుతుందన్న విషయంలో ఆయనకే సందేహాలు ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
మరి.. ఇలాంటివేళ కోటి డోసుల్ని కొనుగోలు చేసేందుకు కేటీఆర్ వద్ద ఉన్న రోడ్ మ్యాప్ ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అన్నింటికి మించి డిసెంబరు చివరి నాటికి రాష్ట్ర మంతా వంద శాతం వ్యాక్సిన్ అంటే.. రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు. అందులో కోటి మందిని పక్కన పెట్టినా.. రెండున్నర కోట్లకు రెండుడోసులు చొప్పున ఐదు కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయి. ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్ చూస్తే తెలంగాణలో ఐదు శాతం లోపునే అంటే.. లక్ష్యం రెండున్నర కోట్లు అంటే.. 12.5లక్షల మందికే ఇచ్చినట్లుగా చెబుతున్నారు కాదు.. 20 లక్షల మందికి ఇచ్చరనే అనుకుందాం. ఇంకా.. 2.3కోట్ల మందికి ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే.. దగ్గర దగ్గర నాలుగు కోట్ల వ్యాక్సిన్లు కేవలం ఆర్నెల్లలో పూర్తి చేయటం సాధ్యమా? అన్నది ప్రశ్న. ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యం మంచిదే కానీ.. అందుకు తగ్గ రోడ్ మ్యాప్ ఉందా? ఉంటే అదేమిటో వెల్లడిస్తే.. ప్రజలు మరింత ధీమాగా ఉంటారు కదా? ఆ వివరాల్ని కేటీఆర్ వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.