Begin typing your search above and press return to search.
అందుకే విశాఖకు వస్తామని కేటీఆర్ అన్నారా?
By: Tupaki Desk | 11 March 2021 5:30 AM GMTవిశాఖ ఉక్కును రక్షించుకోవటానికి అవసరమైతే సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకొని విశాఖకు వస్తామని.. అక్కడ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామన్న మంత్రి కేటీఆర్ మాటలు పుట్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న కేటీఆర్.. అనూహ్యంగా విశాఖ ఉక్కు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే క్రమంలో.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ ఇష్యూ మీద ఏపీలోని రాజకీయ పార్టీలు తగిన రీతిలో స్పందించటం లేదన్నమాట బలంగా వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఒకే రోజున మంత్రి కేటీఆర్ నోట.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ తోనూ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించం విశేషం. ఈ ఇద్దరు ప్రముఖులు హైదరాబాద్ లో ఉన్న వారు కావటం గమనార్హం. ఇంతకూ కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ మాట వెనుక అర్థం ఏమిటి? పరమార్థం ఏమిటి? ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు మాట అత్యంత వ్యూహాత్మకంగా చెబుతున్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాస్త మెరుగైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవటంతో పాటు.. భావోద్వేగ అంశాల విషయంలో న్యాయం ఎటు ఉంటే తాము కూడా అటే ఉంటామన్న సంకేతాన్ని ఇవ్వటం ద్వారా.. మరికొందరు తటస్తుల మనసుల్ని దోచుకునేందుకే కేటీఆర్ ఈ రీతిలో మాట్లాడి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
ఇందులోనిజం పాళ్లను పక్కన పెడితే.. సోదర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం ద్వారా.. ఏపీకి ఏదైనా నష్టం వాటిల్లితే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న స్పష్టమైన సందేశాన్ని కేటీఆర్ ఇచ్చినట్లైందని చెబుతున్నారు. ఏమైనా.. తాను చేసిన ప్రకటనతో ఏపీలోని పార్టీలకు కేటీఆర్ చురుకు పుట్టించారని చెప్పక తప్పదు. విశాఖకు వచ్చి మద్దతు ఇస్తామన్న సందేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఎంతలా ప్రభావితం చేసిందన్న విషయం ఫలితాన్ని చూసి మాత్రమే చెప్పగలిగే పరిస్థితి.