Begin typing your search above and press return to search.
కేంద్రం ఎన్నికోట్ల ఉద్యోగాలిచ్చింది..?: బండి సంజయ్ కు కేటీఆర్ బహిరంగ లేఖ
By: Tupaki Desk | 26 Dec 2021 8:30 AM GMTతెలంగాణ నిరుద్యోగులకు ఎవరేం చేశారో తేల్చుకుందామని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకమారావు సవాల్ విసిరారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్ష సిగ్గులేని దీక్ష అంటూ విమర్శించారు. తెలంగాణ యువతను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకుందన్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చిందో లెక్క చెప్పాలని బహిరంగ లేఖ రాశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటి వరకు దేశంలో ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలిచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయంలో క్లారిటీ లేకుండా నిరుద్యోగ దీక్షలంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా..? అని అన్నారు.
కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్నో రకాలుగా ఉద్యోగాలు రావాల్సి ఉందన్నారు. కానీ ఐటీ జాబ్స్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. కేంద్రం వల్ల ఇప్పటి వరకు తెలంగాణకు దక్కిన బాబ్స్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. డీమానిటైజైషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి..? ఊడిపోయిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా..? అని అన్నారు. ప్రపంచ మంతా కరోనా సంక్షోభ సమయంలో కొట్టుమిట్టుడుతుండగా దేశంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ప్రగల్భాలు పలికాలన్నారు. ఆ నిధులు ఎంత మందికి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని రాష్ట్రాలకు ఉద్యోగాలు అందించారు. ఎంతమంది నిరుద్యోలు తక్కువయ్యారు..? అని అడిగారు. ఇప్పటి కేంద్ర ద్వారా అందించిన ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల సంగతి పక్కనబెడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకున్నారో చెప్పాలన్నారు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని, అంతేకాకుండా సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
నిరుద్యోగ దీక్షలంటూ భూటకపు దీక్షలు చేస్తున్నారని, యువతను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఉద్యోగాలిచ్చిందన్నారు. లక్షలాది ఉద్యోగాలను పెండింగులో పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే మనసు ఉంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 15 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందకు కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని అన్నారు. కేంద్ర ఎప్పుడైనా యువతను పట్టించుకుందా..? అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ నాయకుల దీక్షలను ప్రజలెవరు పట్టించుకోరన్నారు. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించాలన్నారు. అంతేగానీ లేనిపోని అభాండాలు వేసి భూటకపు దీక్షలు చేయొద్దన్నారు.