Begin typing your search above and press return to search.
ఉదయం కేటీఆర్ ఓపెనింగ్.. సాయంత్రం ఆంక్షల జీవో జారీ?
By: Tupaki Desk | 2 Jan 2022 4:27 AM GMTచేసే పనికి..చెప్పే మాటకు సింక్ లేకున్నా.. చేసుకుపోవటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుంది. ఓవైపు కరోనా మూడో వేవ్ నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాలు ఆంక్షల్ని అమలు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆ మాటకు వస్తే.. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. డిసెంబరు 31న.. జనవరి 1న చేపట్టిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. డిసెంబరు 31న మద్యం అమ్మటానికి వీలుగా అర్థరాత్రి 12 గంటల వరకు షాపుల్ని ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వటం మొదలు.. హైదరాబాద్ లోని నాంపల్లిలో న్యూమాయిష్ ఎగ్జిబిషన్ నను కొత్త సంవత్సరం రోజున తెరిచేశారు.
ఇక..డిసెంబరు 31 అర్థరాత్రి వేళ హైదరాబాద్ మహానగరం పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన సీపీలు.. అర్థరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమం ఎంత సందడిగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతదాకా ఎందుకు.. జనవరి 1న షేక్ పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇద్దరూ హాజరు కావటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న సందడి చూసినప్పుడు.. పరిమితులు.. ఆంక్షలు.. భౌతిక దూరం లాంటివన్నీ నీళ్ల మీద రాసిన మాటలుగా కనిపిస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేసిన జీవోను చూశాక నోటి వెంట మాట రాదంతే. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ నెల 10 వరకు సభలు.. సమావేశాల.. ర్యాలీలు.. రాజకీయ.. కల్చరల్.. మతపరమైన కార్యక్రమాల పై నిషేధం విధించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితుల పై సమీక్షను నిర్వహించారు.
ఈ రివ్యూ మీటింగ్ లో సోమేశ్ కుమార్.. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు.. పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భౌతిక దూరం లాంటి వాటిని కచ్ఛితంగా అమలయ్యేలా షాపులు.. మాల్స్ యజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా రవాణా.. దుకాణాలు.. మాల్స్.. ఆఫీసుల్లో మాస్కు ధరించటం..భౌతిక దూరం పాటించటం వంటి వాటిని కచ్ఛితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు.. జరుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేని మాటలు చెప్పినట్లుగా అనిపించక మానదు. ఇంతకు మించిన కామెడీ ఏముంటుంది చెప్పండి?