Begin typing your search above and press return to search.
కేటీఆర్ సొంత నియోజకవర్గంలోని స్కూళ్లలో బోర్ నీళ్లే దిక్కా?
By: Tupaki Desk | 31 May 2022 5:36 AM GMTసొంత తల్లికి అన్నం పెట్టలేని వారు..పినతల్లికి బంగారు గాజులు చేయిస్తారట.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ఇవే సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భగీరథ అంటూ నీళ్లు పారించిన తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు.. తమ సొంత నియోజకవర్గాల్లో ఎలా పాలిస్తున్నారన్నది అందరూ ఆరాతీస్తారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ను గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఆరాతీశారు.
మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం లేదన్న విషయం మీకు తెలుసా?
మొత్తం 37 ప్రభుత్వ బడులు ఉండగా.. వాటిలో 19 స్కూళ్లలోని విద్యార్థులు బోర్ వాటర్ తాగుతున్నట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది.
కేవలం ఒక్క స్కూల్ లో మిషన్ భగీరథ నీళ్లు అందుబాటులో ఉన్నట్లు తేలింది. తెలంగాణలో నంబర్ 2 అయిన కేటీఆర్ ఇలాకాలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాక.. తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అక్కడి రూపురేఖలు మారిపోయాయి. చేనేతన్నలకు సంవత్సరం పొడువున బతుకమ్మ చీరలు, సహా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తున్నాడు. ఉపాధి చూపించాడు. ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాడు. స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలా మార్చాడు. కానీ అందులో మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదన్న విమర్శ వస్తోంది.
తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం పిల్లలకు మినరల్ వాటర్ లేదని.. బోర్ నీళ్లే తాగుతున్నారన్న విషయం బయటపడింది. మిషన్ భగీరథ నీళ్ల కనెక్షన్లు కూడా లేవన్న విషయం తెలిసింది. దీంతో మంత్రి కేటీఆర్ ను కొందరు ఇదే విషయంపై సోషల్ మీడియాలో నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.