Begin typing your search above and press return to search.

అబ్బో.. కేటీఆర్.. ప‌వ‌న్ మ‌ధ్య బంధం మ‌రీ అంత‌నా?

By:  Tupaki Desk   |   18 Oct 2018 4:39 AM GMT
అబ్బో.. కేటీఆర్.. ప‌వ‌న్ మ‌ధ్య బంధం మ‌రీ అంత‌నా?
X
ప్ర‌ముఖ మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాని చిన్న వార్త ఒక‌టి ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు.. తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసిన‌ట్లుగా చిన్న వార్త ఒక‌టి క‌నిపించింది. మీడియాలో పెద్ద‌గా చ‌ర్చ‌కు రాని ఈ వార్త ఆస‌క్తిక‌రంగానే కాదు.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంద‌ని చెప్పాలి.

ఇంత‌కీ.. కేటీఆర్ ప‌వ‌న్ కు ఎందుకు ఫోన్ చేసిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే వ‌చ్చే స‌మాధానం వింటే నిజ‌మా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన క‌వాతు స‌భ స‌క్సెస్ కావటం పై ప‌వ‌న్ కు కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఒక రాజ‌కీయ పార్టీ భారీ స‌భ‌ను నిర్వ‌హిస్తే.. అందుకు అభినంద‌న‌లు తెల‌పాల్సిన అవ‌స‌రం ఏమిటి? ఒక రాజ‌కీయ పార్టీకి చెందిన ముఖ్య‌నేత ఒక‌రు మ‌రో రాజ‌కీయ పార్టీ అధినేత‌కు ఫోన్ చేసి మ‌రీ మీ స‌భ భారీగా సాగింద‌ట క‌దా? స‌క్సెస్ అయ్యింద‌ట.. కంగ్రాట్స్ లాంటి సంభాష‌ణ‌లు ఉంటాయా? అన్న‌ది ప్ర‌శ్న‌.

మ‌రింత ముఖ్య‌మైన అంశం ఏమంటే.. ప‌వ‌న్ కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపిన వైనం జ‌న‌సేన నుంచి కాక టీఆర్ఎస్ నుంచి వార్త బ‌య‌ట‌కు రావ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ ఫోన్ కాల్ పుణ్య‌మా అని.. గులాబీ జ‌ట్టుకు ప‌వ‌న్ నుంచి అప్ర‌క‌టిత మ‌ద్ద‌తు ఉందా? అన్న సందేహం రాక మానదు. మిగిలిన రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన‌ప్పుడు.. దానికి కంగ్రాట్స్ ఫోన్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌న్న క‌ల్చ‌ర్ ను కేటీఆర్ షురూ చేసినోడు అయ్యాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.