Begin typing your search above and press return to search.

ఆ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపడానికి కేటీఆర్ ప్లాన్?

By:  Tupaki Desk   |   23 Sep 2021 2:30 AM GMT
ఆ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపడానికి కేటీఆర్ ప్లాన్?
X
మిలటరీ ఆధీనంలో ఉండి.. ప్రత్యేక ప్రతిపత్తి కలిగి అభివృద్ధి పరంగా వెనుకబడి పోతున్న కంటోన్మెంట్ పై మంత్రి కేటీఆర్ నజర్ పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ అనేక ఆంక్షలతో సరిగ్గా పనులు ముందుకు సాగకపోవడంతో జీహెచ్ఎంసీలో ఈ ప్రాంతాన్ని కలిపేయడానికి స్కెచ్ గీసినట్టు తెలిసిందే. తాజాగా ‘కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేద్దామా?’ నాకు ఓకే.. మరి మీకు ఏంటి?’ అని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీసింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలన్న డిమాండ్ ఇటీవల ఊపందుకుంది. దీనిపై స్పందించిన కేటీఆర్ ప్రజాభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్టు చెప్పారు. మరి మీరు ఏమంటారు అంటూ ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

మంత్రి కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.

కొందరు కంటోన్మెంట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ కేటీఆర్ అప్పట్లో ట్వీట్లుచేశారు. బ్రిటీష్ పరిపాలనను గుర్తుకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో దాదాపు 10లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్య, అభివృద్ధికి ఏకైక పరిష్కారం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలపడమే అంటూ చాలా మంది కేటీఆర్ కు సపోర్టుగా ట్వీట్ చేశారు.