Begin typing your search above and press return to search.
బాబు - కేటీఆర్ - లోకేష్ సెల్ఫీల సందడి చూశారా?
By: Tupaki Desk | 23 Jan 2018 12:59 PM GMT స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరం..అనూహ్యమైన ఎపిసోడ్ లకు వేదికగా మారింది. ఆ నగరంలోనే ఇవాళ్టి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరగుతోంది. ఇప్పటికే ఆ నగరానికి ప్రపంచదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - తెలంగాణ మంత్రి కేటీఆర్ - ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయితే ఈ సందర్భంగా సెల్ఫీల సందడి కొనసాగింది.
ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరైన ఈ ముగ్గురు ప్రముఖులు తమ రాజకీయ విబేధాలు - సిద్ధాంతపరమైన అంశాలను పక్కనపెట్టి సరదాగా గడిపారు. ముఖ్యంగా సెల్ఫీల సందడి కొనసాగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి కేటీఆర్ సెల్ఫీ దిగారు. మరోవైపు మంత్రి లోకేష్ తో కూడా ఆయన సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలో ఏపీకి చెందిన యువ ఎంపీ జయదేవ్ కూడా ఉన్నారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా, దావోస్ లో పే పాల్ వైస్ ప్రెసిడెంట్ రిచార్డ్ నాష్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఫిన్ టెక్ లో పే పాల్ వివిధ సేవలు అందిస్తోంది. ఒక స్టార్ట్ అప్ రాష్ట్రంగా అధునాతన టెక్నాలజీ వినియోగంతో కేవలం మూడున్నర ఏళ్లలో అభివృద్ధి సాధించామని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. ఐటి - ఫిన్ టెక్ అభివృద్ధి కి అనేక చర్యలు తీసుకుంటున్నామని...దేశంలో ఏ రాష్ట్రంలో లేని పాలసీలు - రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. పాత టెక్నాలజీలను పక్కన పెట్టి బ్లాక్ చైన్,ఫిన్‌టెక్ లాంటి టెక్నాలజీల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అమరావతి పరిధిలో ల్యాండ్ రికార్డ్లు అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ కిందకి తీసుకువస్తున్నామని, దీని వలన ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరిగే అవకాశం ఉండదని మంత్రి లోకేష్ తెలిపారు. ల్యాండ్ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ ప్లాట్ ఫార్మ్ పైకి తీసుకురావడంతో రుణాలు అతి తక్కువ సమయంలో పొందే అవకాశం వచ్చిందన్నారు.
విశాఖపట్నంలో వీసాతో కలిసి పని చేస్తున్నాం లెస్ క్యాష్ సిటీ గా విశాఖపట్నం ను మార్చేందుకు చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలు అన్ని క్యాష్ లెస్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పే పాల్ తో కలిసి పనిచేస్తున్నామని...పే పాల్ నుండి ఎలాంటి పైలెట్ ప్రాజెక్ట్స్ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామన్నారు. కాగా, పే పాల్ వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున విస్తరించాలి అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని పే పాల్ వైస్ ప్రెసిడెంట్ రిచార్డ్ నాష్ వివరించారు.