Begin typing your search above and press return to search.
కేటీఆర్ తో ఫొటో దిగేందుకు బాబు-లోకేష్ ఆసక్తి
By: Tupaki Desk | 24 Jan 2018 5:53 AM GMTదావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్‌పై నెటిజన్లు ముఖ్యంగా తెలుగువారు తెగ ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రఖ్యాత సదస్సు వేదికగా మనకు ఎన్ని వేలక కోట్ల పెట్టుబడులు రానున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు కాదు...ఈ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ చేసే ప్రచార కార్యక్రమాల గురించి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇటు బాబు అటు లోకేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్కడ ఈ ఇద్దరు కుదర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన ఫొటో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో దిగిన ఫొటో గురించి. కేటీఆర్ తో బాబు - లోకేష్ ఉన్న ఫోటోలు చూసి కొందరు క్రేజీ అని స్పందిస్తుండగా..మరికొందరు...కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు - బాబు లోకేష్ పోటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో కేటీఆర్‌తో బాబు - లోకేష్ ఫోటోలపై సెటైర్లు బాగానే పేలుతున్నాయంటున్నారు.
పైగా ఈ రెండు ఫొటోల్లో ఇటు సీఎం చంద్రబాబు అటు ఆయన తనయుడు నారా లోకేష్ స్మైల్ ఇస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సమావేశం తాలుకు ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దావోస్ లో తను ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా - మంత్రి లోకేష్ - తనకు సుపరిచితుడు అయిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో భేటీ అయినట్లు కేటీఆర్ వివరించారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.