Begin typing your search above and press return to search.
మీరే నిజమైన నాయకన్
By: Tupaki Desk | 21 Feb 2018 11:35 AM GMTకమల్ రాజకీయం రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం మదురైలో సభ నిర్వహించి కొత్తపార్టీ ఏర్పాటు, ఎజెండా గురించి చర్చించనున్నారు. అంతకంటే ముందుగా రాజకీయ యాత్ర మొదలు పెట్టిన కమల్ హాసన్ దద్దమ్మలు , పనికిరాని పువ్వులం కాదంటూ అవాకులు చెవాకులు పేల్చారు. పనిలో పనిగా చంద్రబాబు తన హీరో అని వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు సేవ చేసే విధానంపై సలహాలు - సూచనలు ఇచ్చారు' అని చెప్పుకొచ్చారు. తన పార్టీ సిద్ధాంతాలపై చంద్రబాబు ఓ సూచన చేశారని చెప్పారు. ప్రజలకు చేయాల్సిన పనులు మనస్సులో ఉన్న వాటిని ఆచరణలో పెడితే అవే పార్టీ సిద్ధాంతాలవుతాయని చంద్రబాబు చెప్పారని కమల్ గుర్తుచేశారు.
అయితే కమల్ వ్యాఖ్యలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. . ఓటుకు నోటుకు కేసులో దోషిగా ఉన్న చంద్రబాబునే ఆదర్శంగా తీసుకోవాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కనబెడితే కమల్ రాజకీయరంగప్రవేశం కోసం ఏర్పాటు చేసిన సభకు దేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖుల్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వారిలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. అయితే అన్వేక కారణాల వల్ల రాలేకపోతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కమల్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాను మదురై సభకు రాలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. కమల్ జీ మీకు ధన్యవాదాలు. నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నా. నిజమైన ‘నాయకన్ నూతన ‘ ప్రస్థానం విజయవం కావాలని ఆశిస్తున్నాను. నిజ జీవితంలోనూ ‘నాయకన్'గా మీరు(కమల్) బాగా రాణించాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.