Begin typing your search above and press return to search.

విన్నారా... హ‌రీశ్‌-కేటీఆర్ మధ్య వార్ లేద‌ట‌

By:  Tupaki Desk   |   14 Nov 2017 6:58 AM GMT
విన్నారా... హ‌రీశ్‌-కేటీఆర్ మధ్య వార్ లేద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వార‌స‌త్వంలో పోరు జ‌రుగుతోంద‌ని...ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌..మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంద‌నే వార్త‌లు కొద్దికాలంగా హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ బావ‌బావ‌మ‌రుదులు సంద‌ర్భానుసారం వాటిని ఖండిస్తుండ‌టం...మ‌ళ్లీ ఏదో సంఘ‌ట‌న ఆధారంగా ఇదే చ‌ర్చ జ‌ర‌గ‌డం జ‌రుగుతున్న క‌థే. ఎంత ఖండించినా... కోల్డ్ వార్ ఇద్ద‌రి మ‌ధ్య ఉంద‌నేది కొంద‌రి వాద‌న‌. అయితే దానికి చెక్ పెడుతూ తాజాగా మంత్రి కేటీఆర్ త‌న మేన‌బావ హ‌రీశ్‌ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇద్ద‌రు క‌లిసి నిర్వ‌హించిన స‌మావేశం సాక్షిగా అధికారుల‌కు ఈ ఆదేశాలిచ్చారు.

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు - మునిసిపల్ అధికారులతో సచివాలయంలో మంత్రులు హ‌రీశ్ రావు - కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది తర్వాత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల రూపు రేఖలు సంపూర్ణంగా మార్చాలని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మున్సిపల్ చైర్మన్లు - కమిషనర్లను మంత్రులు కేటీఆర్ - హరీశ్ రావు ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ సిద్ధిపేట లాగా ఆదర్శ మున్సిపాలిటీగా మారాలని అన్నారు. కోమటి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌ గా తీర్చిదిద్ద‌డం - వైకుంటధామంను చ‌క్క‌గా తీర్చిదిద్ద‌డం వంటి మంత్రి హ‌రీశ్ రావు వినూత్న‌ కార్యక్రమాలను కేటీఆర్ ప్రశంసించారు. సిద్ధిపేటలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి వాటిని యథాతథంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

కాగా, పుర‌పాల‌క సంఘాల బ‌లోపేతం కోసం ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ 10 కోట్ల ప్రత్యేక నిధులతో ప్రజలకు అవసరమైన పార్కులు - మోడల్ మార్కెట్లు - స్మశానాల అభివృద్ధి - పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పలు పురపాలక సంఘాలలో సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియ జరుగుతున్నట్టు కేటీఆర్ చెప్పారు.