Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎంత పెద్ద మొన‌గాడో చెబుతున్నాడు!

By:  Tupaki Desk   |   4 Jan 2019 5:28 AM GMT
కేసీఆర్ ఎంత పెద్ద మొన‌గాడో చెబుతున్నాడు!
X
ఎవ‌రో మ‌న గొప్ప‌త‌నం గురించి చెప్పటం ఏమిటి? మ‌న‌కు మ‌నం కూడా చెప్పుకోవాలి క‌దా? అన్న‌ట్లుగా మారింది టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు చూస్తే. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ సారు మొన‌గాడిత‌నాన్ని అదే ప‌నిగా కీర్తిస్తున్నారు కేటీఆర్.

తండ్రి ఎంత పెద్ద తోప‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ఎంత డేంజ‌రో అన్నది చెబుతూ.. మొన‌గాళ్లు లాంటోళ్ల‌కు సైతం చేత‌కానిది కేసీఆర్ కు చేత‌నైంద‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా కోట్ చేస్తున్నారు కేటీఆర్. తండ్రి ఇమేజ్ మీద ప్ర‌త్యేక దృష్టిని పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. తాను ఏ స‌భ‌కు వెళ్లినా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని అప్ప‌గించిన కేసీఆర్ గొప్ప‌త‌నాన్ని అదే ప‌నిగా పొగ‌డ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు వెళ్లిన ఇందిర‌.. వాజ్ పేయ్.. చంద్ర‌బాబుల్లో ఎవ‌రూ గెల‌వ‌లేద‌ని.. అలాంటిది కేసీఆర్ సాధించార‌ని.. అదంతా తెలంగాణ ప్ర‌జ‌ల గొప్ప‌త‌నంగా కీర్తించారు. ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్ గెల‌వ‌ద‌న్న మాట‌ను చాలామంది అన్నార‌ని.. కానీ తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తూ కేసీఆర్‌కు విజ‌యాన్ని అందించార‌న్నారు. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్నిచూస్తే.. 2014 ఎన్నిక‌ల్లో సాధించిన దాని కంటే పెద్ద గెలుపును ప్ర‌జ‌లు త‌మ‌కిచ్చార‌న్నారు. తండ్రి గొప్ప‌త‌నాన్ని ఒక ప‌క్క కీర్తిస్తూనే మ‌రోవైపు కేటీఆర్ త‌న మార్క్ ను స్ప‌ష్టంగా ప్ర‌ద‌ర్శించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తండ్రి గొప్ప‌ను చెప్పుకోవ‌టంతో ఆప‌కుండా.. తండ్రి విజ‌యాన్ని ప్ర‌జ‌ల ఖాతాలోకి త‌ర‌లించటం ద్వారా కేటీఆర్ లాంటి మ‌న‌సున్న మ‌నిషి మ‌రొక‌రు లేర‌న్న‌ట్లుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిల‌వ‌టం ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. ఏమైనా కేసీఆర్ ను కంటికి క‌నిపించే దేవుడిగా మార్చేందుకు కేటీఆర్ ప‌డుతున్న త‌ప‌న అంతా ఇంతా కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.