Begin typing your search above and press return to search.
రాజ్యసభలో మాట్లాడని సచిన్..కేటీఆర్ ప్రశంస
By: Tupaki Desk | 22 Dec 2017 5:46 PM GMTక్రికెట్ దిగ్గజం - మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండల్కర్ తీరుతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. లేక లేక రాజ్యసభలో అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత తొలిసారి మాట్లాడటానికి క్రికెట్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ప్రయత్నించి విఫలం చెందింతే..ఆ వైఫల్యంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంటే....సచిన్ ఎందుకు కేటీఆర్ కు నచ్చాడనే కదా మీ సందేహం? దానికి ఓ ఆసక్తికరమైన సమాధానం కేటీఆర్ వద్ద ఉంది. రాజ్యసభలో మాట్లాడే చాన్స్ తప్పిపోయిన తర్వాత సచిన్ చేసిన పని కేటీఆర్ కు తెగ నచ్చేసింది.
రాజ్యసభలో స్వల్పకాల చర్చకు సిద్ధమైన సచిన్ టెండుల్కర్ కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో మాస్టర్ డకౌటైపోయాడు. అయితే నిన్న రాజ్యసభలో ఏం చెప్పాలనుకున్నాడో ఇవాళ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా చెప్పాడు. క్రీడలను ప్రేమించే దేశంగా పేరున్న ఇండియాను క్రీడలను ఆడే దేశంగా మార్చడం తన బాధ్యత అని ఆ వీడియో సందేశంలో మాస్టర్ చెప్పాడు. తన ఈ కలను అందరి కలగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాస్టర్ పిలుపునిచ్చాడు. తనకు క్రికెట్ అంటే ప్రాణమని, దానిని గుర్తించి తనకు ఆడే స్వేచ్ఛను, హక్కును ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని సచిన్ అన్నాడు.
అయితే సచిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెలంగాణ మంత్రి, సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కేటీఆర్‌కు తెగ నచ్చేసింది. 3డీ ఫెయిలయినా సచిన్ మెప్పించాడని ప్రశంసించారు. యూట్యూబ్ వేదికగా తన భావాలను వినిపిస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 3డీ ఫార్ములా విఫలమయినప్పటికీ కీలక అంశంపై చర్చకు 4డీని తెరమీదకు తెచ్చి సచిన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని ట్వీట్ చేశారు. ‘బహిరంగంగా ఓ విషయంపై చర్చించడం, చర్చలో ఇతరులను భాగం చేసుకోవడం వారి భావాలను వినడం, అసమ్మతి తెలియజేయడం (డిస్కస్,డిబేట్, డిసెంట్) అనే 3డీ ఫార్ములాకు అంతరాయం కలిగిన సమయంలో సచిన్ ఎంచుకున్న 4డీ (డిస్‌రప్షన్- నూతనమార్గం) ప్రశంసనీయం. ఈ మూడు అంశాలు విఫలమైనప్పుడు ఎలా వ్యక్తీకరించాలో సోషల్ మీడియా వేదికగా సచిన్ నిరూపించారు. క్రీడల పట్ల తనకున్న తపనను మరోమారు ఆయన చాటిచెప్పారు. ఇది అభినందనీయం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా...సచిన్‌కు మాట్లాడే చాన్స్ దక్కకపోవడం పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ కు కాంగ్రెస్ నిరసనల కారణంగా మాట్లాడే అవకాశం రాని నేపథ్యంలో దిగ్గజ ఆటగాడు, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ నే మాట్లాడకుండా అడ్డుకుంటారా? అని బీజేపీ కాంగ్రెస్‌పై మండిపడింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఒకింత ఘాటుగా స్పందించారు. `భారతరత్న పురస్కారం పార్లమెంటులో మాట్లాడేందుకు లైసెన్సా?` అని ప్రశ్నించారు. అసలు సచిన్ రాజ్యసభకు నామినేట్ అయ్యింది యూపీఏ హయాంలోనే అని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణం చేసిన నాటి నుంచి సభ 348 రోజులు జరిగిందని, అయితే ఆ దిగ్గజ ఆటగాడు సభకు హాజరైంది కేవలం 23 రోజులు మాత్రమేనని రేణుక ఎద్దేవా చేశారు. అటువంటి సభ్యుడికి మాట్లాడే అవకాశం రాకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్లు బీజేపీ వారు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.