Begin typing your search above and press return to search.
‘‘రామోజీ’’కి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడరా?
By: Tupaki Desk | 28 Feb 2016 5:04 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్నట్లుగా పలువురు విమర్శిస్తుంటారు. అలాంటి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తన మాటను పూర్తిగా మర్చిపోయారని విమర్శిస్తుంటారు. మరోవైపు.. రామోజీ ఫిలింసిటీ గురించి తాను అలాంటి మాట ఎప్పుడూ అనలేదని.. కావాలంటే సాక్ష్యం చూపాలంటూ ఆ మధ్యన కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం తెలిసిందే. నిజానికి రామోజీ ఫిలింసిటీకి సంబంధించిన విమర్శలు.. ఆరోపణల్ని కాసేపు పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు.. దేశానికి అదో మణిపూసగా చెప్పాలి.
గుడ్లగూబలు గుడ్లు కూడా పెట్టని ప్రాంతాన్ని అత్యంత సుందరంగా మార్చటంతో పాటు.. రామోజీ ఫిలింసిటీని పెంచి పెద్దది చేయటానికి మీడియా మొఘల్ రామోజీరావు తన సర్వశక్తులు ఒడ్డిన విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి ఆయన కానీ రామోజీఫిలిం సిటీని నిర్మించకుండా.. ఏ పవర్ ప్రాజెక్టుల పైనో.. మరింకేదైనా పరిశ్రమల మీద దృష్టి సారించి ఉంటే.. ఆర్థికంగా ఆయన ఎంతో అబ్థి పొందేవారని చెప్పాలి.
తన జీవితకాల కోరిక అయిన ఫిలింసిటీని అత్యద్భుతంగా రూపొందించాలన్న ఒకేఒక్క లక్ష్యం రామోజీని ఎన్నోకష్టనష్టాలకు గురి చేసిందనటంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. రామోజీ కష్టాన్ని తెలంగాణ సర్కారు గుర్తించటమే కాదు.. తెలంగాణ ప్రచారానికి రామోజీ ఫిలింసిటీని వినియోగించటం గమనార్హం. తెలంగాణలో అద్భుతమైన షూటింగ్ ప్రాంతాలకు నెలవంటూ రూపొందించిన ఒక వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. ఇదిగో.. తెలంగాణ అద్భుతం అంటూ తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన వీడియోను ఆయన షేర్ చేశారు.
ఈ వీడియోలో రామోజీ ఫిలింసిటీతో పాటు.. నల్గొండ.. వరంగల్.. ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉన్న షూటింగ్ స్పాట్లను ప్రస్తావించటం గమనార్హం. కేటీఆర్ తాజాగా షేర్ చేసిన వీడియోను చూస్తే.. రామోజీ ఫిలింసిటీకి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్లు కనిపంచక మానదు. ఉద్యమ సమయంలో అన్నారని చెప్పే (?) లక్ష నాగళ్ల స్థానే.. ‘సొగసు చూడతరమా’ అంటూ చేస్తున్న ప్రచారం చూస్తే కేసీఆర్ అండ్ కోలో చాలానే మార్పు వచ్చిందని చెప్పక తప్పదు.