Begin typing your search above and press return to search.
గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్
By: Tupaki Desk | 5 Jan 2020 9:53 AM GMTమంత్రి కేటీఆర్.. సీఎం కుమారుడిగా తెలంగాణ రాజకీయ తెరపైకి వచ్చిన ఆయన తనలో మానవత్వం, దయాగుణం ఉందని చాలా సార్లు నిరూపించుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో, పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత చురుకుగా ఉంటారు. తాజాగా మరోసారి ఆపదలో ఉన్న ఓ చిన్నారిని ఆదుకొని తన గొప్ప మనసు చాటారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి మూత్రపిండాల సమస్యతో బాధపడుతోందని ఆదుకోవాలని కేటీఆర్ కు బాధితులు ట్వీట్ చేశారు. నందిపేట కు చెందిన దర్శనం శ్రీనివాస్-సవిత దంపతుల కుమార్తె అవంతిక (4) కిడ్నీలు చెడిపోయాయని.. శస్త్రచికిత్స చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. పేదవారు అయిన వారి తల్లిదండ్రుల వద్ద డబ్బు లేకపోవడంతో బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఇది చూసిన నందిపేట టీఆర్ఎస్ నాయకుడు హడ్వాల వినయ్ కుమార్ స్పందించారు. అమెరికాలోని తన స్నేహితుడు మంద మధుకు పరిస్థితి వివరిస్తే ఆయన కేటీఆర్ దృష్టికి బాలిక సమస్యను తీసుకెళ్లాడు. ట్విట్టర్ లో కేటీఆర్ కు పోస్టు చేయగా.. దీనిపై వేగంగా స్పందించిన కేటీఆర్ బాలికకు పూర్తి సహాయం చేస్తానని చెప్పి గొప్ప మనసు చాటుకున్నారు.