Begin typing your search above and press return to search.
ఏపీకి మూడు రాజధానులు..కేటీఆర్ ఏమన్నారంటే?
By: Tupaki Desk | 29 Dec 2019 2:50 PM GMTఏపీకి ఇకపై మూడు రాజధానులు ఉంటాయేమోనంటూ సాక్షాత్తు సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన నిజంగానే వేడి పుట్టించింది. జగన్ నోట నుంచి వచ్చిన ఈ కామెంట్ అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ పెద్ద చర్చకే తెర తీసింది. ఏపీకి మూడు రాజధానుల అంశం... కేవలం ఏపీకి చెందిన అంశమే అయినప్పటికీ... తెలంగాణలోనూ దీనిపై ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అక్కడే దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది.
ఏపీకి మూడు రాజధానుల అంశంపై మీ అభిప్రాయం ఏమిటి సార్ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్ ను అడిగేశాడట. మరొకరైతే... ఎలా స్పందించేవారో, ఏమో తెలియదు గానీ... ఏ అంశమైనా, సందర్భం ఏదైనా సరే... తనదైన శైలి స్పాంటేనియస్ గా స్పందించే కేటీఆర్ మాత్రం తనను ప్రశ్నించిన నెటిజన్ తో పాటు సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్ ను ఆసక్తిగా గమనించే వారు సహా యావత్తు తెలుగు ప్రజలు ఆశ్చర్యపోయేలా స్పందించారు. ఏపీ విషయంపై తన స్పందనతో ఆయన ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా... ఏ ఒక్కరు కూడా తనపై ఎదురు దాడికి దిగకుండా కూడా కేటీఆర్ మసలుకున్నారు.
అయినా ఏపీకి మూడు రాజధానులపై కేటీఆర్ ఏమని స్పందించారంటారా?... ‘‘మూడు రాజధానుల అంశాన్ని నిర్ణయించాల్సిందే ఏపీ ప్రజలే. నేను కాదు’’ అని కేటీఆర్ చాలా సింపుల్ గానే కాకుండా చాలా స్పాంటేనియస్ గా స్పందించేశారు. నిజమే మరి... ఏపీకి మూడు రాజధానుల విషయంలో కేటీఆర్ ఏ రీతిన స్పందించినా ఉపయోగం లేదు కదా. ఏపీకి మూడు రాజధానుల విషయాన్ని ఏపీ ప్రభుత్వం - ఏపీ ప్రజలు - ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు తేల్చుకుంటాయి కదా. ఏపీ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని కేటీఆర్ స్పందించి మాత్రం ఏం ప్రయోజనం? నిజమే... అందుకే ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రజలే నిర్ణయిస్తారంటూ కేటీఆర్ తెలివిగా స్పందించారు.