Begin typing your search above and press return to search.

కేటీఆర్ వాట్సప్ కు సూసైడ్ మెసేజ్

By:  Tupaki Desk   |   28 March 2016 4:36 AM GMT
కేటీఆర్ వాట్సప్ కు సూసైడ్ మెసేజ్
X
తెలంగాణ మంత్రి కేటీఆర్ వాట్సప్ అకౌంట్ కి వచ్చిన ఒక మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఫోన్ నెంబరుకు ఒక నేతన్న వాయిస్ మెసేజ్ పెట్టారు. తనకున్న బాధల్ని ప్రస్తావించటంతో పాటు.. తన కుటుంబానికి న్యాయం చేయాలన్న విన్నపంతో పాటు.. తాను సూసైడ్ చేసుకోనున్నట్లు మేసేజ్ లో పేర్కొనటం సంచలనంగా మారింది. తనను వేదిస్తున్న వారి గురించిన వివరాలతో పాటు.. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని సదరు వ్యక్తి సవివరంగా చెప్పుకోవటం గమనార్హం.

వస్త్ర పరిశ్రమలో చిన్నోళ్లను పెద్దోళ్లు బతకనీయటం లేదని.. కేటీఆర్ అయినా ఆ పరిస్థితిని మార్చాలంటూ కరీంనగర్ జిల్ల్లా సిరిసిల్ల నేతన్న తన ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు.. సేట్ లు.. మర్వాడీలు తనను ఎంతలా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. వ్యాపారంలోని పలు అంశాల్ని పేర్కొన్నాడు.

తనను డబ్బుల కోసం అజయ్ భాయ్ గట్టిగా కొట్టాడని.. తాను నష్టపోయిన విషయాన్ని చెప్పి.. ఆదుకోవాలన్న పట్టించుకోకపోవటం తర్వాత.. తనను విపరీతమైన అవమానాలకు గురి చేస్తున్నట్లు వాపోయాడు. చనిపోవాలని రెండు సార్లు అనుకున్నా పెళ్లాం.. పిల్లలు గుర్చుకు వచ్చి ఆగినట్లుగా సదరు వ్యక్తి పేర్కొన్నాడు. తనను ఇబ్బంది పెడుతన్న వారి పేర్లను వివరంగా వెల్లడించిన ఈ వాట్సప్ మెసేజ్ కు స్పందించిన కేటీఆర్.. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. వ్యాపారుల్ని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వమని చెప్పినట్లుగా చెబుతున్నారు.