Begin typing your search above and press return to search.
కేసీఆర్ పనితీరుకు ఇదో నిదర్శనం
By: Tupaki Desk | 31 Aug 2016 6:12 AM GMTసీఎన్ బీసీ బిజినెస్ టీవీ చానెల్ ప్రతిఏటా ఇచ్చే లీడర్ అవార్డుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈ ఆవార్డును ఢిల్లీలో అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తన తండ్రి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడేశారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ఢిల్లీ వేదికగా దక్కిన గౌరవమని చెప్పారు.
అవార్డును అందుకున్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ - మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు అందుకోవడం మాత్రమే కాకుండా ఆ ప్రామిస్ లను అమలుచేసి గుర్తింపు సంపాదిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా చమత్కరించారు. కొత్తరాష్ట్రమే అయినా అనేక రాష్ట్రాలతో పోటీపడి అవార్డు అందుకోవడం సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు - పనితీరుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. దేశంలోనే త్వరలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన, అతి తక్కువ వయసు కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నదనడానికి - అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నదనడానికి ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. ప్రజలకు అభివృద్ధి - సంక్షేమ ఫలాలను అందించడానికి సంక్షేమం - సాగునీరు - పరిశ్రమలు.. ఇలా పలురంగాల్లో నూతన పాలసీలు వచ్చాయని, ఇవే తెలంగాణ పురోగామి రాష్ట్రంగా తయారు కావడానికి దోహదం చేశాయని కేటీఆర్ చెప్పారు.