Begin typing your search above and press return to search.

ఉపాస‌న కొత్త ఉద్యోగాన్ని కేటీఆర్ గుర్తించారండోయ్!

By:  Tupaki Desk   |   26 Jan 2019 7:56 AM GMT
ఉపాస‌న కొత్త ఉద్యోగాన్ని కేటీఆర్ గుర్తించారండోయ్!
X
ఉపాస‌న అంటే మామూలుగా. మెగాస్టార్ ఇంటి కోడ‌లు. మెగాప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి. అంతేనా.. కామినేని.. అపోలో ఆసుప‌త్రుల గ్రూపుకు వార‌సురాలు. మ‌రింత పలుకుబ‌డి ఉన్న ఆమె.. తెలంగాణ రాష్ట్రం కోసం ప‌డుతున్న క‌ష్టం గురించి టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కు చెప్పుకోవాల‌నుకోవ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది.సాదాసీదా జ‌నాలు తాము చేసిన క‌ష్టాల్ని త‌మ పైనోళ్లు గుర్తించాల‌ని త‌పిస్తుంటారు. కొంత‌మంది అయితే అలా గుర్తించాల‌ని కోరుకోవ‌టం కూడా త‌ప్ప‌ని ఫీల‌య్యే వాళ్లు ఉంటారు. మ‌రికొంద‌రైతే.. ప‌ని చేశాం.. చెప్పుకుంటే ఏం త‌ప్పు? అనుకొని మ‌రీ తాము చేసిన ప‌నిని చెప్పేసుకుంటారు.

ఇక్క‌డ ఏది త‌ప్పు? ఏది రైటు? అని చెప్ప‌టం లేదు. మొత్తంగా ఎవ‌రి ఆలోచ‌న‌లు వారివి. ఎవ‌రికి త‌గ్గ‌ట్లుగా వారు ఉండ‌టం మామూలే. అయితే.. ఉపాస‌న లాంటి పెద్ద మ‌నిషి తెలంగాణ రాష్ట్రం కోసం అంత‌లా క‌ష్ట‌ప‌డుతుంటే.. మెగా ఫ్యామిలీని నెత్తిన పెట్టుకొని చూసుకునే ఆంధ్రోళ్ల కోసం.. ఏపీ కోసం ఏమీ చేయ‌రా? అంటూ కొంద‌రు ఫీల‌య్యారు.ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ వార్షిక స‌మావేశం సంద‌ర్భంగా హాజ‌రైన ఉపాస‌న‌.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకున్న కంపెనీల‌కు స‌మాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర కౌంట‌ర్ వ‌ద్ద ప‌ని చేయ‌టం.. ఆ విష‌యాన్ని ఆమె ట్వీట్ రూపంలో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌టం తెలిసిందే.

ఉపాస‌న ట్వీట్ వార్తాంశంగా మార‌టమే కాదు.. సోష‌ల్ మీడిమాలో భారీ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఇదిలా ఉంటే.. ఉపాస‌న ట్వీట్‌కు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఉపాస‌న కోరుకున్న‌ట్లే ఆమె కొత్త జాబ్ ను ఆయ‌న గుర్తించ‌ట‌మే కాదు.. ఆమె క‌ష్టాన్ని కూడా అర్థం చేసుకున్న‌ట్లుగా ఆయ‌న తాజా ట్వీట్ ఉంది. ఉపాస‌న చేస్తున్న ప‌నితో త‌మ బృంద స‌భ్యుల్లో ఉత్తేజం రెట్టింపు అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మొత్తానికి ఉపాస‌న కోరుకున్న‌ట్లే కేటీఆర్ గుర్తించ‌ట‌మే కాదు..కాంప్లిమెంట్ ఇచ్చి ఉపాస‌న‌లో మ‌రింత ఉత్సాహాన్ని నింపార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.