Begin typing your search above and press return to search.

అక్బరుద్దీన్ గుస్సాకు కేటీఆర్ ఏం చేసారంటే..

By:  Tupaki Desk   |   23 Dec 2016 7:01 AM GMT
అక్బరుద్దీన్ గుస్సాకు కేటీఆర్ ఏం చేసారంటే..
X
అంశం ఏదైనా కానీ పైచేయి ఎప్పుడూ ఒక్కరి చేతుల్లో ఉండదు. మార్పు మాత్రమే శాశ్వితం. తమ మాటలతో.. చేతలతో అందరిపై అధిపత్యం ప్రదర్శించే తెలంగాణ అధికారపక్షం.. మిత్రుడి విషయంలో మాత్రం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. మరే రాజకీయపక్షం విషయంలో కించిత్ తగ్గటానికి ఇష్టపడని టీఆర్ఎస్ అధినాయకత్వం మజ్లిస్ ముఖ్యనేతలు తీరుతో మాత్రం కిందామీదా పడుతున్నారు.

పేరుకు మిత్రుడే అయినా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అధికారపక్షాన్ని తమ మాటలతో చురుకు పుట్టిస్తున్న మజ్లిస్ శాసనసభాపక్షనేత.. తాజాగా తమ మాటలతో కేటీఆర్ కు బీపీ తెచ్చినంత పని చేశారు. భావోద్వేగ రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి చేసే అలవాటున్న టీఆర్ఎస్ కే.. షాకిచ్చే వ్యాఖ్యల్ని చేశారు అక్బరుద్దీన్. నీళ్లు.. నిధులు శివారు ప్రాంతాలకే తరలుతున్నాయియని.. పాతబస్తీలో నివసిస్తున్న వారే నిజమైన తెలంగాణ వాసులని.. నీళ్లు.. కాంట్రాక్టులు ఆంధ్రా వారికే ఇస్తారా? హైదరాబాద్ పాతబస్తీలో ఉండే తెలంగాణ వారికి నీళ్లివ్వరా? అంటూ అక్బరుద్దీన్ మాటలు తెలంగాణ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

అక్బరుద్దీన్ సంధించిన ప్రశ్నాస్త్రాలపై సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఆంధ్రా.. తెలంగాణ అన్న పంచాయితీలు లేవని స్పష్టం చేశారు. మెరుగైన నీటి సరఫరా చేస్తున్నందుకే పాతబస్తీ ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించటమేకాదు.. గతంలో ఎప్పుడూ లేనట్లుగా వంద సీట్లను తాము గెలుచుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడిన అక్బరుద్దీన్ పై ఎదురుదాడి చేసినట్లే చేస్తూనే.. ఒకదశలో ఆయన సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్ బుజ్జగించిన తీరు చూస్తే.. మజ్లిస్ ను మిత్రుడిగా ఫీలయ్యే టీఆర్ ఎస్ కు చుక్కలు చూపించే సత్తా అక్బరుద్దీన్ అండ్ కోకు మాత్రమే ఉందన్న భావన కలగకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/