Begin typing your search above and press return to search.
ప్రశ్న అడిగితే పార్టీ జెండాలు మోసినట్లా?
By: Tupaki Desk | 5 Dec 2015 5:00 AM GMTతెలంగాణలో కొందరు జర్నలిస్టుల పరిస్థితి మహా ఇబ్బందికరంగా ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయాలు.. సచివాలయం చూసే రిపోర్టర్లు అయితే ఊహించని రీతిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కోకు మద్ధుతుగా నిలవటమే కాదు.. వారిని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఉద్యమానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ప్రశ్నలు అడిగే ధోరణికి చెక్ పెట్టిన టీఆర్ ఎస్ నేతలు.. తెలంగాణ వచ్చి.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఫార్మూలాను ఉపయోగించటం విశేషం.
తమను ప్రశ్నించే వారు ఎవరైనా సరే.. నిందలు పాలు కాక తప్పదన్నట్లుగా టీఆర్ ఎస్ నేతల వైఖరిగా మారింది. వివిధ పార్టీల నుంచి జోరుగా సాగుతున్న వలసలపై తాజాగా సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను ప్రశ్నలు వేశారు. జర్నలిస్టులు వేసే ప్రశ్నలు తమకు అనుకూలంగా ఉండాలే కానీ.. ప్రతికూలంగా ఉండటాన్ని ఏ మాత్రం ఇష్టపడని గులాబీ నేతలకు తగ్గట్లే.. కేటీఆర్ స్పందించారు. టీఆర్ ఎస్ లోకి వలసల్ని తాము ప్రోత్సహిస్తున్నామన్న వాదనను తీవ్రంగా తిప్పికొట్టిన ఆయన.. నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలోకి వస్తామంటున్నారని.. వారేమైనా చిన్న పిల్లలా అని వ్యాఖ్యలు చేసిన ఆయన.. అయినా.. పార్టీలోకి వస్తామనే వారిని వద్దంటామా? అంటూ అడగాల్సిన రీతిలో అడిగేశారు. పార్టీలో చేరే వారికి ఆఫర్లు.. హామీలు ఇచ్చారని వస్తున్న ఆరోపణలపై ప్రశ్నలు వేసిన జర్నలిస్టలుకు చుక్కలు చూపించేలా మాట్లాడిన కేటీఆర్.. మేం వారికి హామీలు.. ఆఫర్లు ఇస్తున్నట్లుగా మీకు ఎవరు చెప్పారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.
తమ ప్రశ్నలతో రాజకీయ నేతల్ని ఇరుకున పెట్టే జర్నలిస్టులకు కేటీఆర్ పుణ్యమా అని కొత్తఅనుభవం ఎదురైంది. తమను ప్రశ్నించే వారిని డిఫెన్స్ లో పడేలా మాట్లాడే అద్భుత టాలెంట్ ఉన్న మంత్రి కేటీఆర్.. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ జెండాలు మోసే కార్యక్రమానికి మీడియా స్వస్తి పలకాలంటూ చురకలు అంటించారు. చూస్తుంటే.. తెలంగాణ అధికారపక్షాన్ని ప్రశ్నించే రీతలో వచ్చే ఏ ప్రశ్నను ఫేస్ చేయటానికి గులాబీ బ్యాచ్ సిద్ధంగా లేకపోవటమే కాదు.. అలా ప్రశ్నలు వేసే వారికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చే ఫార్ములాతో జర్నలిస్టుల నోటవెంట మాట రాని పరిస్థితి.