Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని ఒప్పించిన కేటీఆర్
By: Tupaki Desk | 11 Nov 2016 4:51 AM GMTకేంద్ర ప్రభుత్వ రాజకీయాలపై ఒకింత అవగాహన ఉన్న వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారులో నంబర్ 2 ఎవరంటే తట్టేపేరు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీది. అలాంటి జైట్లీని తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి - పరిశ్రమలు - ఐటీ శాఖల మంత్రి-సీఎం కేసీఆర్ తనయుడు కే తారక రామారావు తను అనుకున్న పాయింట్ పై ఒప్పించారు. అంతేకాదు ఆఘమేఘాల మీద దానికోసం కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను కూడా ఇప్పించారు. ఇంతకీ అదేంటంటే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500 - రూ.1000 నోట్లతో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను - నల్లా బిల్లు - కరెంటు బిల్లు తదితరాలను శుక్రవారం అర్ధరాత్రి వరకు పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవడం. ఈ బిల్లులకు చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను వర్తించదు. ఇది తన ప్రయత్నం ఫలితమని స్వయంగా కేటీఆర్ చెప్పారు.
నోట్లు రద్దు సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ గురువారం ఉదయం ఢిల్లీలో ఉన్న తన షెడ్యూల్ ప్రకారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన రూ.500 - రూ.1000 నోట్లతో గ్రామీణ స్థాయి నుంచి మున్సిపాల్టీలు - కార్పొరేషన్లవరకు పెండింగ్ పన్నులు - యుటిలిటీ బిల్లులు - విద్యుత్ తదితర బకాయిల చెల్లింపునకు పాత నోట్లను అనుమతించాలని విజ్ఞప్తి చేయగా.. జైట్లీ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ మేరకు అమలు చేసేందుకు గెజిట్ కూడా విడుదల చేయించడం విశేషం. మంత్రి విజ్ఞప్తితో దేశవ్యాప్తంగా ప్రజలకు అదనపు ఊరట కలిగింది. ఈ బిల్లులకు చెల్లించే మొత్తం పన్ను మినహాయింపు ఉన్న రెండున్నర లక్షల పరిధిలోకి రాదని ఆయన స్పష్టంచేశారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి కేటీఆర్.. రాత్రి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని, వీటి బకాయిలను పాత నోట్లతో చెల్లించే విధంగా చేస్తే ఉభయతారకంగా ఉంటుందని జైట్లీకి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల మొండి బకాయిలు వసూలు కావడంతోపాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, అదే సమయంలో ఆయా సంస్థలకు ఆదాయం సమకూరుతుందని జైట్లీకి తెలిపారు. కేటీఆర్ అభిప్రాయాలను సావధానంగా విన్న కేంద్రమంత్రి వెంటనే విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు ఫోన్ చేశారు. దీన్ని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నవంబర్ 11 (శుక్రవారం) అర్ధరాత్రి వరకు సదరు అంశాలపై పాత నోట్లను అనుమతించేలా విద్యుత్‌శాఖ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా అమలవుతుందని స్వయంగా జైట్లీయే కేటీఆర్‌కు చెప్పారు. ఈ విషయాలను హైదరాబాద్‌లో విలేకరులకు వివరించిన కేటీఆర్.. ముఖ్యంగా గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్ను - కరెంట్ బిల్లు వంటి యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంచాయతీలు - మున్సిపాలిటీలు - కార్పొరేషన్లు - హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు తదితరాల్లో శుక్రవారం ఇతర సేవలన్నీ రద్దు చేసి, కేవలం బిల్లుల చెల్లింపుపైనే అధికారులు కేంద్రీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ కౌంటర్లు పని చేస్తాయని ఆయన స్పష్టంచేశారు.
పాత నోట్ల విషయంలో ఫేస్ బుక్ - వాట్సప్ వంటి సోషల్ మీడియాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కేటీఆర్ కోరారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఏడాదికి ముందస్తు చెల్లింపు కూడా పాత నోట్లతో జరుపొచ్చని చెప్పారు. బిల్లులు చెల్లించే క్రమంలో తమ ఖాతాలో రూ.2.5 లక్షలకు మించితే వాటికి ఆదాయం పన్ను పడుతుందన్న ఆందోళనలో ప్రజలున్నారన్న కేటీఆర్.. తాజా గెజిట్ ప్రకారం చెల్లించే పన్నులు - పాత బకాయిలు - యుటిలిటీ చెల్లింపులకు - రూ.2.5 లక్షల ఆదాయ పరిమితికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.తన విజ్ఞప్తిని మన్నించి ఉత్తర్వులు జారీ చేయించిన జైట్లీ - పీయూష్ గోయల్ కు ప్రజల తరఫున - వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అనుకూల నిర్ణయం తీసుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని కేటీఆర్ చెప్పారు. తాన విజ్ఞప్తితో దేశవ్యాప్తంగా పంచాయతీలు - మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు పాత నోట్లతో బిల్లులు చెల్లించే అవకాశం వచ్చిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/