Begin typing your search above and press return to search.
సీఎం సీటు పై స్పందించిన కేటీఆర్
By: Tupaki Desk | 1 Jan 2020 11:37 AM GMTనూతన సంవత్సరం సందర్భం గా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. 2019 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించామని.. 2020ని మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో మొదలు పెడుతామని ధీమా వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తులేదని.. విడివిడిగానే పోటీచేస్తామని తెలిపారు.
ఈ సందర్బం గా తర్వాత సీఎం మీరేనంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరులు ప్రస్తావించగా కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ దీని మీద వివరణ ఇచ్చారని.. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కేసీఆర్ ప్రకటించారని.. ఇంకా తనను త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేయడం తగదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను సీఎం కాబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ శాశ్వత శత్రువులు కారని.. బీజేపీ, కాంగ్రెస్ లు తమకు శత్రువులు కాదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎం కూడా తమకు మిత్రుడేం కాదని వివరణ ఇచ్చారు.