Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను షాక్ కు గురయ్యేలా చేసిన ట్వీట్
By: Tupaki Desk | 6 Dec 2017 5:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మంత్రి హోదాలో ఎంతమందికి తెలుసో....సోషల్ మీడియాలో చురుకుగా స్పందించడం ద్వారా కూడా అంతే మందికి తెలుసు. ఆయన మంత్రి కంటే పేజ్ 3 సెలబ్రిటీలాగానే ఎక్కువగా కనిపిస్తుంటారు. వ్యవహరిస్తుంటారు కూడా! అలా అని మంత్రి బాధ్యతలను కూడా పక్కనపెట్టరు. అందుకే ఆయనకు టీఆర్ ఎస్ పార్టీ నేతలతో పాటు యూత్ లో కూడా పెద్ద ఎత్తున్నే ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ జాబితాలో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు కూడా చేరారు. అందులోనూ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ కు వారు సన్నిహితులు అవడం ఆశ్చర్యకరం.
తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మంత్రి కేటీఆర్ అత్యంత ఇష్టపడే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విద్యార్థుల్లో కూడా మంత్రికి ఇంత ఫాలోయింగ్ ఉందా? అనే ఆలోచనలో పడేసింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడమే ఆశ్చర్యం అయితే...దానికి మంత్రి కేటీఆర్ రిప్లై ఇవ్వడం అంతకంటే ఆశ్చర్యం. వీటన్నింటికంటే షాకింగ్ ఏంటంటే....ఆ విద్యార్థి ప్రస్తావించిన అంశం. దానికి మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయిన విధానం.
ఇంతకీ విషయం ఏంటంటే...అభిజిత్ కార్తిక్ అనే విద్యార్థి ఈ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఏముందంటే... ‘సర్.. నాపేరు అభి. కేపీహెచ్ బీలోని నారాయణ టెక్నో స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్ టైమింగ్ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. దీనికి తోడుగా ఐఐటీ తలనొప్పి ఒకటి. సోమవారం ఉన్న ఐఐటీ ఓరియంటేషన్ క్లాసులు మా ఆదివారం ఆనందాన్ని చంపేస్తున్నాయి. మా బాల్యాన్ని కాపాడండి. దయచేసి కఠినంగా వ్యవహరించండి’ అంటూ ట్వీట్ చేశాడు. స్కూల్ విద్యార్థి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కదిలిపోయారు. ఈ ట్వీట్ కు స్పందిస్తూ...‘ఈ విషయంపై స్పందించడం చాలా కఠినమైనది అభి. ఈ సమస్య నాకు కూడా బాధను కలిగిస్తోంది. ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిగారి దృష్టికి తీసుకువెళుతున్నాను. త్వరితగతిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
గతంలో ఓ చిన్నారి జేబులో బ్రెడ్ ముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ మరోమారు అదే రీతిలో స్పందించడం... ఈ దఫా ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ అయిన నారాయణ స్కూల్స్ పై మంత్రి కేటీఆర్ తమ విద్యాశాఖ మంత్రి - ఉపముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరికి కంప్లైంట్ చేయడం...అందులో విద్యార్థి ట్వీట్ కు స్పందించడం ఆశ్చర్యకరమని అంటున్నారు.