Begin typing your search above and press return to search.
ఇంటర్ పై కేటీఆర్ స్పందించారబ్బా!..ఎంత ఆవేదనో?
By: Tupaki Desk | 28 April 2019 9:09 AM GMTతెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల విషయంపై ఎట్లకేలకు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఓ వైపు ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంటే... ఏ విషయంపై అయినా చాలా వేగంగా స్పందిచే కేటీఆర్ మాత్రం సైలెన్స్ నే ఆశ్రయించారు. సీఎం కేసీఆర్ కూడా ఐదు రోజుల తర్వాత గానీ... ఈ వ్యవహారంపై స్పందించలేకపోయారు. ఇలాంటి తరుణంలో *ఆక్స్ కేటీఆర్* పేరిట ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్... ఈ రోజు నన్ను ఏదైనా అడగండి... ఆన్సరిస్తానంటూ ప్రకటన చేశారు.
ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్ వివాదంపై కేటీఆర్ ఆవేదనాభరిత స్పందనను వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం క్షమించరానిదేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయినా కేటీఆర్ ఈ స్పందనను తనకు తానుగా ఏమీ ఇవ్వలేదు. ఓ నెటిజన్ అడిగితేనే స్పందించారు. ఎలా స్పందించినా కేటీఆర్ స్పందన మాత్రం తీవ్ర ఆవేదనతో కూడుకుని ఉన్నదని మాత్రం చెప్పక తప్పదు.
సరే... కేటీఆర్‌ను ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్నకు కేటీఆర్ ఎలా స్పందించారన్న విషయానికి వస్తే... విక్రమ్ యాదవ్ అనే నెటిజన్ కేటీఆర్‌కు ఓ ప్రశ్నను సంధిస్తూ....*కేటీఆర్ సార్ అన్నింటికి జవాబు ఇస్తున్నారు. ఇంటర్ పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై నమ్మకాన్ని పోగొట్టకండి. మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేం నమ్ముతున్నాం* అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ కూడా వెనువెంటనే స్పందించారు. *నన్ను ఏం క్లారిఫికేషన్ ఇవ్వమంటారు సార్? మన రాష్ట్రంలో జరిగింది నిజంగా దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటన వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. నేను ఓ తండ్రినే.. పిల్లలను కోల్పోయిన అమ్మానాన్నల బాధను అర్థం చేసుకోగలను* అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటిదాకా ఈ విషయంపై కేటీఆర్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారంతా... ఆయన నోట నుంచి వచ్చిన ఈ ఆవేదనాభరిత రెస్పాన్స్ విన్న తర్వాత శాంతించారనే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఇంటర్ బోర్డు వ్యవహారంలో ఓ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్న మరో నెటిజన్ సూచనకు కూడా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మొత్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించలేదన్న అపప్రదను కేటీఆర్ చెరిపేసుకున్నట్టైందన్న వాదన వినిపిస్తోంది.