Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు ప‌ని చేస్తేనే ఇలాంటి ఫలితాలా కేటీఆర్?

By:  Tupaki Desk   |   29 May 2019 4:31 AM GMT
మ‌నోళ్లు ప‌ని చేస్తేనే ఇలాంటి ఫలితాలా కేటీఆర్?
X
గెలుపుకి.. ఓట‌మికి తేడా ఏమిట‌ని చాలామంది ప్ర‌శ్నిస్తుంటారు. దీనికి ఒక్క లైనులో స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. గెలుపు వ‌చ్చిన వేళ‌.. ఏమ‌న్నా చాలా గొప్ప‌గా మాట్లాడిన‌ట్లు ఉంటుంది. ఓటమిలో ఉన్న వేళ‌.. మాట్లాడే నాలుగు మాట‌లు కూడా చ‌క్క‌గా రాక‌పోగా.. వేలెత్తి చూపించేందుకు బోలెడ‌న్ని అవ‌కావాలు క‌నిపిస్తుంటాయి. తాజాగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట‌లే దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

కారు.. ప‌ద‌హారు అంటూ మా జోరుగా ప్ర‌చారం చేయ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల్లో గెలుపు కేవ‌లం సాంకేతిక‌మే త‌ప్పించి.. తాము గెలిచిపోయిన‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చిన టీఆర్ ఎస్ అధినేత‌కు.. నేత‌ల‌కు ఓట‌ర్లు దిమ్మ తిరిగే షాకివ్వ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల్లో విజయం సాధించిన వెంట‌నే.. నోట్లో నాలుగు ప‌ప్పులు వేసుకొని వ‌చ్చి ప్రెస్ మీట్ పెట్ట‌టం.. కాసింత ఎట‌కారం.. మ‌రికాస్త వ్యంగ్యంతో పాటు.. విలేక‌రులు నోటి నుంచి ప్ర‌తికూల ప్ర‌శ్న‌లు రావ‌టాన్ని అస్స‌లు ఒప్పుకోని కేటీఆర్.. తాజా ఓట‌మి త‌ర్వాత ప్రెస్ మీట్ పెట్ట‌కుండా ఉండిపోయారు.

ఫ‌లితాలు వెలువ‌డిన ఐదు రోజుల త‌ర్వాత కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు కొన్ని ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మిని చాలా లైట్ తీసుకున్న‌ట్లు మాట్లాడిన కేటీఆర్.. త‌మ పార్టీ క‌ష్ట‌ప‌డినంత బాగా మ‌రే పార్టీ క‌ష్ట‌ప‌డ‌లేద‌న్నారు. ఒక‌వేళ ఈ మాటే నిజ‌మైతే.. అంద‌రి కంటే ఎక్కువ‌గా కేసీఆర్.. కేటీఆర్ లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఉంది.

ఎందుకంటే.. మిగిలిన పార్టీలు ప‌ని చేయ‌కుండా.. ఒక్క టీఆర్ ఎస్ బాగా ప‌ని చేస్తేనే ఇలాంటి దారుణ ఫ‌లితాలు వ‌స్తే.. ఏ మాత్రం ప‌ని చేయ‌క‌పోతే ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎదుటోళ్ల‌కు చిక్క‌కుండా మాట్లాడే టాలెంట్ ఉన్న కేటీఆర్ లాంటోళ్లు.. ఇలా మాట‌ల్లో దొరికిపోవ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మంటారు?