Begin typing your search above and press return to search.
తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ సీక్రెట్స్ చెప్పిన కేటీఆర్
By: Tupaki Desk | 1 Nov 2016 10:05 AM GMTఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. మొన్నామధ్య ఓ సర్వే సంస్థ సీఎం కేసీఆర్ పాలన విషయంలో ఫస్ట్ ఉన్నారని చెప్పడం ఇప్పుడు ఏకంగా కేంద్రమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంకు కట్టబెట్టడం మంత్రి వర్గాన్ని ముఖ్యంగా కేసీఆర్ - కేటీఆర్ లను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్టాడిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రం ఫస్ట్ ర్యాంకు సాధించడం వెనుక ఉన్న సీక్రెట్లను వివరించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నవ తెలంగాణ పురోగామిస్తోందని, ఎన్నో రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు. అధికారం చేపట్టిన రెండేళ్లలో ఎన్నోమైలురాళ్లు అధిగమించామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నవ తెలంగాణ పురోగామిస్తోందన్నారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాలు తీసుకొచ్చామన్నారు. 113 ఆన్ లైన్ సర్వీసులు ప్రారంభించామని, కార్మిక శాఖలో 22 సేవలు అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ చెప్పారు. 22 మంత్రిత్వ శాఖలు - వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నందున ఈ ర్యాంకు సాధ్యమైందని చెప్పారు.
సమూలమైన మార్పు - సమగ్రమైన ఆలోచనావిధానంతో సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. అవినీతికి ఆస్కారంలేని విధానాలు అమలు చేస్తున్నామని, పరిశ్రమల తనిఖీల్లోనూ కీలక మార్పులు చేశామన్నారు. సింగిల్ విండో విధానంతో 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని అందరూ ప్రశంసించారని చెప్పారు. పెట్టుబడుల అనుకూలతలో తెలంగాణ 98.78 శాతం సాధించిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 58 జీవోలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో లక్షా 61 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/