Begin typing your search above and press return to search.
రేవంత్ ను పరోక్షంగా కెలికిన కేటీఆర్
By: Tupaki Desk | 26 Dec 2017 5:11 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆ పార్టీపై విరుచుకుపడటంలో ముందుండే ఎమ్మెల్యే - కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల శృతిమించిన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించడంతో పాటుగా గులాబీ నేతల కుటుంబ సభ్యులపై కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు కొందరిని విస్మయానికి గురిచేశాయి. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణ పలువురిని ఆశ్చర్యంలో పడేసింది. అయితే దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కే తారకరామారావు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
జడ్చర్ల కాంగ్రెస్ సభలో మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోపణలకు మంత్రి సమాధానమివ్వగా దానిపై మళ్లీ స్పందించిన రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - టీపీసీసీ రథసారథికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పరోక్షంగా రేవంత్ ను ఎటాక్ చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీపై నైతికంగా బుక్ చేసే ప్రయత్నం చేశారు.
మంత్రి లక్ష్మారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ లో ఒక వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. `ఇలా ఒక నేత మాట్లాడటం సరైనదేనా?` అంటూ కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందనగా కేటీఆర్ ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ `రాష్ట్రమంత్రిని ఉద్దేశించి రేవంత్ చేసిన అత్యంత నీచమైన - తెలివి తక్కువ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలి` అని కోరారు. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్ దానిని గుజరాత్ ఎన్నికలకే పరిమితం చేస్తారేమోనని ట్వీట్ చేశారు.