Begin typing your search above and press return to search.
కేటీఆర్ సాక్షిగా టీఆర్ఎస్ నేతల ముష్టియుద్ధం
By: Tupaki Desk | 25 Nov 2018 5:51 AM GMTటీఆర్ఎస్ నేత, మంత్రి కే తారకరామారావు గ్రేటర్ హైదరాబాద్ ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా శనివారం ఆయన జూబ్లీహిల్స్ - సనత్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కుల - మత - ప్రాంతాలకతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో కుల - మతాలను తెరమీదకు తెస్తున్నాయని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా 15 మంది సీమాంధ్రులను గెలిపించుకున్నామని, ఎమ్మెల్యేలు కూడా ఇతర ప్రాంతాలవారు ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వైపు ఉందామా? ప్రోగ్రెస్ వైపు ఉందామా? తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ - రాహుల్‌గాంధీ కాదు కదా దేవుడితో నైనా తెలంగాణ ప్రయోజనాలకోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
అధికారమే లక్ష్యంగా నాలుగు పార్టీలు కూటమి పేరుతో సీఎం కేసీఆర్‌ను గద్దెదించాలని కుట్రచేస్తున్నాయని, అది జరగదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ``ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచించి ఓటేయాలి.. ఆగం కావద్దు.. టీఆర్‌ఎస్ పై విశ్వాసముంచండి, నమ్మకముంచండని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. పేదోళ్ల ప్రభుత్వమా, పెద్దోళ్ల ప్రభుత్వమా? అర్థం చేసుకుని కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి` అని విజ్ఞప్తిచేశారు.
ఇదిలాఉండగా, కేటీఆర్ సభ సాక్షిగానే టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్యుద్ధం జరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరినొకరు దూషించుకుని వాగ్వివాదానికి దిగారు. కేటీఆర్ రోడ్డు షో నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుల స్టీరింగ్ కమిటీ సభ్యులు శివ, ఇంద్రకరణ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఇన్‌చార్జి సతీశ్‌రెడ్డి ఎర్రగడ్డ వద్ద ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వద్దకు వచ్చి శివ, ఇంద్రకరణ్‌లను ఎందుకు అరెస్టు చేయించావని నిలదీశాడు. దీంతో మాగంటి 'ఇది నీకు సంబంధం లేని విషయం' అంటూ సతీశ్‌రెడ్డిని నెట్టేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడే ఉన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ జోక్యం చేసుకుని ఇద్దర్నీ సముదాయించారు. సతీశ్‌రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. నాయకులను కలుపుకొని పోకుండా, ఇవేం గొడవలని మాగంటి పై బొంతు రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.