Begin typing your search above and press return to search.

కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు.. కేటీఆర్ సెటైర్

By:  Tupaki Desk   |   6 Jan 2019 4:04 AM GMT
కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు.. కేటీఆర్ సెటైర్
X
తెలంగాణలో ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్లే టీ ఆర్ ఎస్ గెలిచిందంటూ వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడారు. ట్యాంపరింగ్ జరిగిందో లేదో కంప్యూటర్లు కనిపెట్టిన చంద్రబాబుకే తెలియాలని సెటైర్ వేశారు.

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కోదండరామ్ ను ప్రజలు తిరస్కరించారని, రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అన్న నిర్ణయం ఆయనే తీసుకోవాలని అన్నారు. టీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం, ఓటరు నమోదుపై చురుగ్గా పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీ గురించి ఏ నిర్ణయమైనా తమ అధినేత కేసీఆరే నిర్ణయిస్తారని, ఆయన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబునాయుడు రావడం వల్లే టీ ఆర్ ఎస్ కు మేలు జరిగిందని, ఆయన రాకవల్లే తాము గెలిచామనడం కేవలం అపోహేనని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు రాకముందే ప్రజలు తమ పార్టీకి ఓటెయ్యాలని డిసైడ్ అయ్యారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదని, వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు.