Begin typing your search above and press return to search.
రాహుల్ జోక్ కేటీఆర్ కు భలే నచ్చేసింది
By: Tupaki Desk | 2 Jun 2017 5:10 AM GMTకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.అవినీతిపై రాహుల్ మాట్లాడటం.. మిలీనియం జోక్ అని దుయ్యబట్టారు. ‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? స్కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? దానిని మేం నమ్మాలా? అవినీతి గురించి స్కాంగ్రెస్ లీడర్లు మాట్లాడటం పెద్ద జోక్..’’ అని విమర్శించారు. ఎన్నికల్లో సొంత స్థానాలను నిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ముందే రాసుకొచ్చిన స్క్రిప్ట్ ను చదివిన రాహుల్ కాంగ్రెస్ పార్టీని మరింత చులకన చేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేడ్ ఇన్ తెలంగాణ ఫోన్లు తీసుకువస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణలో 5 మొబైల్ కంపెనీలు ఇప్పటికే ఫోన్ల తయారీ చేస్తున్నాయని తెలిపారు. రాహుల్ కు మేడిన్ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై పూర్తిస్థాయి వ్యతిరేకత కారణంగానే ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారని గుర్తు చేస్తూ అలాంటి చరిత్ర గల పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు వెంపర్లాడుతోందని... అంటే ఆ రెండు పార్టీలు ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలవాలని అనుకోవడమే తమ బలానికి నిదర్శనమని, వారి బలహీనతకు ప్రతీక అని కేటీఆర్ విశ్లేషించారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకముందని, అందుకే ఆయన మీద ఏకోన్ముఖమైన ఆదరణ చూపెడుతున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ ఎస్ ను ఆదరిస్తున్నారనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కేటీఆర్ విశ్లేషించారు. ``వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయాన్ని ఇచ్చారు. నారాయణఖేడ్ లో అద్భుతమైన మెజార్టీని కట్టబెట్టారు. పాలేరులో 2014లో మాకు డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఉప ఎన్నికలో పాలేరులో విజయదుందుభిని మోగించాం. ఒక్క సీటు కూడా లేని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు సంపాదించాం. గ్రేటర్ వరంగల్‌లో పదిహేను లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాం. ఇవన్నీ ప్రజలు మాపై చూపెట్టిన ఆదరణకు నిదర్శనం.`` అని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/