Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. మేకిన్ తెలంగాణ

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:33 AM GMT
గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. మేకిన్ తెలంగాణ
X
ఒకటి తర్వాత ఒకటిగా దూసుకెళుతోంది తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేసిన ఆయన.. హైదరాబాద్ కు సమీపంలోని కొండకల్ లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు కానుందని.. మేధా గ్రూప్ చేత ఏర్పాటు చేసే ఈ అతి పెద్ద ప్రైవేటు రైలు కోచ్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కోచ్ ప్యాక్టరీ కారణంగా అదనంగా 2200 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్వే కోచ్ లను తయారు చేసి.. అమ్మబోతున్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీకి సంవత్సరానికి 500 రకాల కోచ్ లను.. 50 లోకో మోటివ్స్ ను తయారు చేయనున్నారు. తెలంగాణ సిగలో మరో మణిగా ఈ కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా ఎప్పటికప్పుడు తెలంగాణ.. హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారుతున్నాయని.. మంత్రి కేటీఆర్ చెప్పిన అంశాలు చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.