Begin typing your search above and press return to search.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్

By:  Tupaki Desk   |   10 May 2020 4:06 AM GMT
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్
X
తెలంగాణ రైతులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఇంత కరోనా కరువులోనూ తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమ పథకాల విషయంలో వెనక్కితగ్గడం లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల పథకాల నిధులు ఆగబోవని మంత్రి కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

తాజాగా కేసీఆర్ సర్కార్ రైతుల రుణమాఫీ కోసం 1200 కోట్లను రిలీజ్ చేసింది. రూ.25వేల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ కాబోతున్నాయి. 5.50 లక్షలమంది లబ్ధి పొందుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక అంతేకాదు వానాకాలం పంట కోసం రైతుబంధు నిధులను మంజూరు చేశామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.7వేల కోట్లు విడుదల చేస్తున్నామని.. దీంతో 57 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ మొత్తం కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో జమకాబోతున్నాయని కేటీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. నిజానికి రుణమాఫీ సొమ్మును చెక్కుల రూపంలో అందజేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించిందని.. అయితే లాక్ డౌన్ కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని నేరుగా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఒకటి, రెండు రోజుల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందన్నారు.