Begin typing your search above and press return to search.

రేవంత్ వైట్ చాలెంజ్ కు ఓకే చెప్పిన కేటీఆర్.. ట్విస్టు ఏమంటే?

By:  Tupaki Desk   |   20 Sept 2021 2:02 PM IST
రేవంత్ వైట్ చాలెంజ్ కు ఓకే చెప్పిన కేటీఆర్.. ట్విస్టు ఏమంటే?
X
టీ మంత్రి కేటీఆర్ వర్సెస్ టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ మధ్య ట్వీట్ల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు అవగాహన కలిగించేందుకు వీలుగా.. ఎంపీ సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ చాలెంజ్ మాదిరి వైట్ చాలెంజ్ చేపట్టాలని.. ఇందులో డ్రగ్స్ టెస్టు చేయించుకుందామని మంత్రి కేటీఆర్ కు రేవంత్ సవాలు విసరటం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం అమరవీరుల స్తూపం వద్దకు వస్తే.. ఉస్మానియాకు వెళ్లి పరీక్షలు చేయించుకుందామని పేర్కొనటం తెలిసిందే.

దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవటానికి సిద్ధమని పేర్కొన్నారు. అయితే.. పరీక్ష కోసం రాహుల్ గాంధీ వస్తే తాను కూడా సిద్ధమని ట్విస్టు ఇచ్చారు.చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ గాంధీని ఒప్పించాలని.. రేవంత్ కు చురకలు అంటించారు. అంతేనా.. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని మరో సవాలు విసిరారు.

అంతేకాదు.. తాను పరీక్ష చేయించుకొని క్లీన్ చిట్ తో వస్తే.. రేవంత్ తన పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. దీంతో.. కేటీఆర్ చురకలకు రేవంత్ ఏమని బదులిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.