Begin typing your search above and press return to search.
ఇవాంకా కోసమే రోడ్లు బాగుచేయట్లేదు: కేటీఆర్
By: Tupaki Desk | 17 Nov 2017 1:51 PM GMTఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదం అయిన హైదరాబాద్ మహానగర రోడ్ల బాగుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వాన స్థితికి చేరి దుర్భరమైన ప్రయాణం చేసిన హైదరాబాదీలు అనారోగ్యం పాలైన ఉదంతాలు ఎన్నో. అయితే, అలాంటి కష్టాలు అనుభవించిన వారికి తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో జరుగుతున్న ఈ మార్పు వెనుక కారణం...హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ అని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ నగరానికి రావడం కారణమని పలువ వర్గాల నుంచి వాదనలు వినిపించాయి.
అమెరికా అధ్యక్షుడి తనయ నగరానికి వస్తున్నప్పుడు తప్ప... కేటీఆర్ ఆండ్ టీంకు మన రోడ్లు గుర్తుకు రాలేదని పలు వర్గాలు చేసిన ప్రచారం ఆనోటా ఈనోటా..మంత్రి కేటీఆర్ కు చేరినట్లుంది. తాజాగా ఆయనే స్వయంగా ఈ విషయమై వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేవలం ఇవాంకా ట్రంప్ వస్తోందని రోడ్లు బాగు చేస్తున్నాం అనేది తప్పని అన్నారు. వర్షాకాలం తర్వాత సాధారణంగా చేసే రిపేర్లు ప్రస్తుతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. చార్మినార్ వద్ద అభివృద్ధి పనులను కూడా ఇవాంకా కోసమే అని అనుకుంటున్నారని పేర్కొంటూ అది నిజం కాదన్నారు. ఈ పనులను సైతం తాము ముందే ప్లాన్ చేసామని మంత్రి కేటీఆర్ వివరించారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. దీనికి ఇప్పటి నుంచే తాము సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు - జనవరిలో - ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి - అభివృద్ధి కొనసాగుతుందని..ఇందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.