Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ ను భ‌య‌పెట్టిన లెక్క‌లు!

By:  Tupaki Desk   |   2 Dec 2018 10:12 AM GMT
కేటీఆర్‌ ను భ‌య‌పెట్టిన లెక్క‌లు!
X
లెక్క‌లు.. అదేనండి గ‌ణితం. ఆ స‌బ్జెక్ట్ అంటే చాలామందికి వ‌ణుకు. స్కూల్లో ఉన్న‌ప్పుడు లెక్క‌ల‌ను చూసి భ‌య‌ప‌డ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. తెలంగాణ మంత్రి - కేసీఆర్ త‌నయుడు కేటీఆర్ కూడా అందుకు మిన‌హాయింపేమీ కాద‌ట‌. చిన్న‌ప్పుడు ఆయ‌న కూడా లెక్క‌ల‌ను చూసి జంకేవార‌ట‌. ఈ లెక్క‌ల తిప్ప‌లు ఎప్పుడు త‌ప్పుతాయిరా దేవుడా అంటూ ఎదురుచూసేవార‌ట‌.

స్పిరిట్ ఆఫ్ హైద‌రాబాద్ పేరుతో తాజాగా భాగ్య‌న‌గ‌రంలో ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌లతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కేటీఆర్ కాస్త స‌మయం తీసుకొని ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. చాలా విష‌యాల‌పై త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను అక్క‌డ బ‌య‌ట‌పెట్టారు. త‌న చిన్న‌నాటి స్మృతుల‌ను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలోనే కేటీఆర్ ఓ విష‌యంపై మాట్లాడుతూ.. లెక్క‌లంటే చిన్న‌ప్పుడు త‌న‌కున్న భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ప‌దో త‌ర‌గ‌తి ఎప్పుడు పూర్త‌వుతుందా? ఈ లెక్క‌ల గోల ఎప్పుడు త‌ప్పుతుందా? అని ఆయ‌న ఎదురుచేశార‌ట‌. ఇక టెన్త్ అవ్వ‌గానే గ‌ణితాన్ని త‌ప్పించుకునేందుకే బైపీసీ గ్రూప్ తీసుకున్నార‌ట‌. అయితే - అక్క‌డ కూడా ఆయ‌న‌కు దెబ్బ ప‌డింద‌ట‌. బ‌యాల‌జీ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఫిజిక్స్ - కెమిస్ట్రీల్లోని లెక్క‌లు మ‌ళ్లీ ఆయ‌న్ను చిక్కుల్లో ప‌డేశాయ‌ట‌. చేసేదేం లేక చిన్న చిన్న లెక్క‌లు నేర్చుకొని ఎలాగోలా గ‌ట్టెక్కేశార‌ట‌.

ఇక డిగ్రీ పూర్త‌య్యాక కేటీఆర్ కొన్ని నెల‌ల‌పాటు ఏ ఉద్యోగ‌మూ చెయ్య‌కుండా - పై చ‌దువులు చ‌ద‌వ‌కుండా ఖాళీగా ఉన్నార‌ట‌. దాదాపు ఆర్నెళ్ల‌పాటు ఇంట్లోనే ఖాళీగా వున్నారు అంతే. దీంతో కేటీఆర్‌ కాలాన్ని వృథా చేస్తున్న‌ట్లు గుర్తించిన ఆయ‌న త‌ల్లి.. ఏదైనా ఐటీ కోర్స్ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. అయితే - ఐటీలోనూ కొంత‌మేర‌కు గ‌ణిత‌ముంటుంద‌ని భ‌య‌ప‌డి కేటీఆర్ వాటి జోలికి వెళ్ల‌లేద‌ట‌. అనంత‌రం క్ర‌మంగా ఆయ‌న‌లో మార్పు వ‌చ్చింద‌ట‌. ఆపై అమెరికా వెళ్ల‌డం - మంచి ఉద్యోగం చేయ‌డం - తిరిగి తెలంగాణ‌కు విచ్చేసి ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో పాల్గొన‌డం వంటివి జ‌రిగాయ‌ట‌. మొత్తానికి కేటీఆర్‌ ను లెక్క‌లు భ‌లే భ‌య‌పెట్టాయి క‌దూ..!