Begin typing your search above and press return to search.
వానంటేనే కేటీఆర్ కు భయంగా ఉందట
By: Tupaki Desk | 5 Jun 2017 9:22 AM GMTవిపక్షానికి.. అధికారపక్షానికి మధ్యనున్న వ్యత్యాసం ఇదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి.. వాన పడితే ఏర్పడే ఇబ్బందికర పరిస్థితి గురించి అధికారపక్షంపైన చెలరేగిపోయేవారు టీఆర్ఎస్ నేతలు. అందరికి మించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. నాటి పాలకుల్ని తిట్టి పోసేవారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా ఆయన మాట్లాడిన సందర్భంలోనూ హైదరాబాద్ ను సమైక్యపాలకులు నాశనం చేశారని.. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని.. నీటి చుక్క రోడ్ల మీద ఉండకుండా చేస్తామంటూ బీరాలు పలికారు.
కాలగర్భంలో మూడేళ్లు గడిచిన తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే.. లేవని చెప్పాలి. ఇప్పటికి వర్షం పడితే రోడ్లు తటాకాల్లా మారిపోవటం.. ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లటంలో ఎలాంటి మార్పు రాలేదు. మూడేళ్లు చేతిలో అధికారంలో ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లో పరిస్థితిని ఎందుకు మార్చలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం లేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వర్షాకాలం అంటేనే తనకు భయంగా ఉందని వ్యాఖ్య చేయటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో వర్షం పడకున్నా ఫర్లేదని.. వాన పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచే ప్రమాదం ఉందన్నారు. వర్షం పడితే రోడ్ల మీద వాననీరు నిలుస్తుందన్న సమస్య తెలిసినప్పుడు.. దాని పరిష్కారం గురించి ఆలోచించాల్సింది పోయి.. అవేమీ చేయకుండా వానే కురవొద్దని చెప్పటం ఏమిటో కేటీఆర్ కే అర్థం కావాలి. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయటానికి రూ.11వేల కోట్లు అవసరమంటూ కేటీఆర్ లెక్కలు చెబుతున్నారు.
చూస్తుంటే.. అన్ని వేల కోట్లు కేటాయించలేరు కాబట్టి.. వర్షం పడకుండా.. ఎప్పుడు ఎండ కాస్తూ.. జనాలకు మంట పుడితే బాగుంటుందా కేటీఆర్? అన్న ప్రశ్న వేయాలనిపిస్తుంది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చన్నట్లుగా మాట్లాడిన కేటీఆర్ నోటి నుంచి భయం మాట రావటం దేనికి నిదర్శనం?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/