Begin typing your search above and press return to search.
కేటీఆర్ తో సచిన్ సెల్ఫీ
By: Tupaki Desk | 20 May 2016 7:13 AM GMTస్మార్ట్ రాన్ అనే స్టార్టప్ సంస్థ ‘టి-ఫోన్’ అనే స్మార్టు ఫోన్ ను విడుదల చేసింది. స్మార్టు రాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. ఫోన్ ఆవిష్కరణ తరువాత ఆయన తెలంగాణ ఐటీ మంత్రి - తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడితో సెల్ఫీ దిగడం అందరినీ ఆకట్టుకుంది.
కాగా స్మార్ట్ రాన్ కు సచిన్ ప్రచారకర్తే కాకుండా ఈ కంపెనీలో పెట్టుబడులూ పెట్టారు. ‘ప్రారంభంలో 10,000 ఫోన్లను చైనా నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తారు.. ఆ తరువాత ఇండియలోనే వీటిని తయారు చేస్తారు. ఇండియాలో తయారు చేసేందుకు గాను ఫాక్స్ కాన్ తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సచిన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే టి-ల్యాప్ టాప్ పేరుతో ఒక ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తెచ్చింది. భవిష్యత్తులో టి-అల్ట్రాటాప్ కూడా తీసుకురానుంది.
కాగా సచిన్ తనతో దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో కేటీఆర్ పోస్టు చేశారు. స్మార్టురాన్ సంస్థకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందిస్తామని ఆయన ప్రకటించారు. కాగా సచిన్ కూడా ఎప్పటిలా హైదరాబాద్ పట్ల తనకున్న అభిమానాన్ని ప్రకటించారు. తాను కేవలం రెండే రెండు విషయాల కోసం హైదరాబాదు వస్తానని.. అవి ఒకటి క్రికెట్ - రెండోది బిరియానీ అని చెప్పారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్లనని చెప్పాడు. కాగా సచిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్న మంత్రి కేటీఆర్ ఆయన తనతో ఫొటో దిగడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.