Begin typing your search above and press return to search.

డ‌బ్బులు అడిగితే కొట్ట‌మంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   4 April 2017 9:38 AM GMT
డ‌బ్బులు అడిగితే కొట్ట‌మంటున్న కేటీఆర్‌
X
ప్ర‌త్య‌ర్థుల‌పై బుల్లెట్ లాంటి మాట‌లతో విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. విష‌యం ఏదైనా స‌రే నాన్‌స్టాప్‌గా త‌న వాద‌న‌ను వినిపించే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చాలా విష‌యాల్లో య‌మా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవ‌ల కాలంలో జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న ఆయ‌న‌..రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముగిసిన క‌థ‌గా అభివ‌ర్ణిస్తున్న కేటీఆర్‌.. త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్రమాల గురించి గుక్క‌తిప్పుకోకుండా వివ‌రాలు చెప్పుకొస్తున్నారు.

నిన్న‌టికి నిన్న తాండూరులో నిర్వ‌హించిన జ‌న‌జాగృతి స‌భ‌లో మాట్లాడిన కేటీఆర్‌.. ఈ రోజు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని దివిటిప‌ల్లి వ‌ద్ద ఆయ‌న డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్ని ప‌రిశీలించారు. ఇళ్ల మంజూరు విష‌యంలో ఎవ‌రిని న‌మ్మొద్ద‌న్న కేటీఆర్‌.. ద‌ళారుల మాట‌ల్ని అస్స‌లు న‌మ్మ‌కూడ‌ద‌ని చెప్పారు.

ఎవ‌రైనా మాయ‌మాట‌లు చెప్పి.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామ‌ని చెప్పి.. అందుకు డ‌బ్బులు ఏమైనా అడిగితే మాత్రం.. వాళ్ల‌ను కొట్టాలంటూ పిలుపునివ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌ప్పు చేసిన వారి భాగోతాల్ని పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని చెప్ప‌టం బాగుంటుంది కానీ.. అలా కాదు చ‌ట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోమ్మ‌న్న‌ట్లుగా కేటీఆర్ మాట‌లు ఉండ‌టం ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల‌తో పోలిస్తే.. తెలంగాణ‌లోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణం సాగుతుంద‌న్న కేటీఆర్‌.. ఇలాంటి మంచి ప‌థ‌కంపైనా ఆరోప‌ణ‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. కాంగ్రెస్ హ‌యాంలో ఇందిర‌మ్మ ఇళ్లు అంటూ ఇరుకైన ఇళ్ల‌ను క‌ట్టించి.. దానికి మూడు రంగులు వేసి ఇచ్చారంటూ ఎట‌కారం చేసిన కేటీఆర్ స‌టైర్లు బాగానే ఉన్నా.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా మాట‌లు చెప్ప‌ట‌మే బాగోలేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మంత్రిగారి మాట‌ల‌తో స్ఫూర్తి పొంది.. దంచుకు కార్య‌క్ర‌మం మొద‌లెడితే.. కొత్త స‌మ‌స్య‌లు త‌లెత్త‌టం ఖాయమ‌న్న విష‌యాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/