Begin typing your search above and press return to search.
అప్పట్లో కిరణ్ కుమార్ ఎత్తి పొడుపును తాజాగా బయటపెట్టిన కేటీఆర్
By: Tupaki Desk | 28 April 2020 1:30 AM GMTనోటి నుంచి వచ్చే మాటను వెనక్కి తీసుకోలేమన్న విషయాన్ని పెద్దోళ్లు తరచూ చెబుతుంటారు. తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం మరింత బాగా అర్థమవుతుంటుంది. కొన్ని జరిగిపోయిన సంఘటల్ని టైమ్లీగా తెర మీదకు తీసుకురావటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత బాగా వచ్చో.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కు అంతే బాగా వచ్చని చెప్పాలి. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికర అంశాల్నివెల్లడించారు.
ఇప్పటివరకూ ఎప్పుడూ చెప్పని ఒక విషయాన్ని తాజాగా ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎదుర్కొన్న ఎత్తిపొడుపుల్ని.. అవమానాల్ని ఆయన తాజాగా బయటపెట్టారు. గతంలో జరిగిన ఏ విషయాన్ని తాను మర్చిపోలేదని.. అన్నింటిని గుర్తు పెట్టుకున్న వైనం కేటీఆర్ మాటల్ని చూస్తే ఇట్టే గుర్తుకు రాకమానదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డిని తాను కలిసిన సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని తాజాగా గుర్తు చేసుకున్నారు కేటీఆర్.
‘‘అప్పట్లో టెక్స్ టైల్స్ పై 5 శాతం వ్యాట్ వేశారు. ఆ విషయం మీద మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వచ్చాను. నువ్వు చాయ్ తాగుతావా? కాఫీ తాగుతావా? అని కిరణ్ అడిగారు. నేను కాఫీ తాగుతానంటే.. ఏందయ్యా.. మీ తెలంగాణ వాళ్లు చాయ్ తాగుతారు కదా? అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మన అలవాట్లు.. వ్యవహారశైలిపై ఎత్తిపొడుపు మాటలు అనేవారు. తెలంగాణకు చెందిన మంత్రే.. ఒక రోడ్డుకు రూ.50లక్షలు కావాలని అడిగితే.. యాభై సార్లు తిరిగినా ఇవ్వేలదు. తెలంగాణ తెచ్చుకుంటామంటున్నారు కదా? తెచ్చుకోండి చూద్దామనేవారు. అప్పట్లో తెలంగాణ నేతలు కొందరు కేసీఆర్ ను దూషించేవారని.. అన్నీ గుర్తున్నాయి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజా వ్యాఖ్యల్నిచూసినప్పుడు గతంలో జరిగిన ఏ విషయాన్ని తాను మర్చి పోలేదని.. అన్నింటిని గుర్తు పెట్టుకున్నట్లుగా కేటీఆర్ మాటల్నిచూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ పార్టీ ఉద్యమ పార్టీ కాదని.. ఇక ఫక్తురాజకీయ పార్టీ అని కేసీఆర్ చెప్పారని.. అన్ని పార్టీల మాదిరే తమ పార్టీ కూడా ఉందని వ్యాఖ్యానించారు.