Begin typing your search above and press return to search.
మహా కూటమి కాదు.. జప్ఫా కూటమి అట!
By: Tupaki Desk | 7 Oct 2018 5:37 AM GMTమాటలు తూటాల్లా పేలటం రాజకీయాల్లో మామూలే. కానీ.. ఇప్పుడు తూటాలు కాస్తా తిట్లుగా మారాయి. అది కూడా గలీజ్ గా. నోటికి వచ్చినట్లుగా.. ఏ మాత్రం బాధ్యత లేని రీతిలో తిట్టేస్తున్న వైనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ తిట్ట రాజకీయాల్ని షురూ చేసింది కేసీఆరే. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో దునుమాడే కేసీఆర్..తాజాగా మరో అడుగు ముందుకేసి మరింత ఘాటుగా తిట్టిపోస్తున్నారు.
నువ్వు ఒకటి అంటే నేనురెండు అంటా అన్న చందంగా కేసీఆర్ తిట్లకు మరింతగా చెలరేగిపోతున్నారు విపక్ష నేతలు. ఇప్పటివరకూ తాము తిట్టటమే కాదు.. తిరిగి తిట్టుకోవటం అంతగా లేని కేసీఆర్ అండ్ కోకు.. విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే మరింతగా చెలరేగిపోతున్నారు. కేసీఆర్ వారసులుగా.. తమ తిట్ల దండకాన్ని మరింతగా పెంచుతున్నారు. కేసీఆర్ రాజకీయ వారసుడిగా చెప్పుకునే కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడిగా.. తిట్ల విషయంలో కేసీఆర్ తర్వాత ఆయనే అన్న చందంగా విరుచుకుపడుతున్నారు.
తాజాగా ఆయన విపక్షాల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని హాట్ హాట్ గా మార్చటమే కాదు.. ప్రతిపక్ష నేతలు వెనువెంటనే మరిన్ని కొత్త తిట్ల కోసం ఎంక్వయిరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే.. కేటీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన తిట్లు చూ్స్తే.. ఒక యువనేత నోటి నుంచి ఈ తరహా మాటలా? అని ఆశ్చర్యపోక తప్పదు.
రాజకీయంగా మైలేజీ మాత్రమే ముఖ్యం తప్పించి.. మరింకేమీ అక్కర్లేదని ఫీలయ్యే కేటీఆర్ లాంటి వారి నుంచి ఇంకేమీ ఊహించలేమన్న వైనం తాజాగా ఆయన మాటల్ని వింటే ఇట్టే అర్థం కాక మానదు. మహాకూటమి కాదు.. జప్ఫా కూటమి అంటూ తిట్టేసిన కేటీఆఱ్.. కాంగ్రెస్ నేతలకు బలుపు ఎక్కువని.. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ బలుపునకు.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని చెప్పటం గమనార్హం.
నెహ్రు మొదలు సోనియా వరకూ అందరూ తెలంగాణను రాచి రంపాన పెట్టినోళ్లేనని మండిపడిన ఆయన.. టీఆర్ ఎస్వీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు.కేటీఆర్ ప్రసంగంలో ఘాటు వ్యాఖ్యల్ని శాంపిల్ గా చూస్తే..
+ తెలంగాణ సాధన కోసం పని చేయకుండా ఇంట్లో పడుకున్న నువ్వు సైనికుడివి కావు.. బంట్రోతువు ఉత్తమ్
+ ఉద్యమంలో పాల్గొనని చిచోరాగాళ్లు.. చిల్లరగాళ్లు.. టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు.
+ కాంగ్రెస్ నేతలు నన్ను బచ్చాగాడు అంటారు. అవును.. బచ్చాగాళ్లమైన మేమే తెలంగాణ సాధించాం. వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పేది మేమే.
+ అది మహా కూటమి కాదు.. అదొక జఫ్పా కూటమి. దాంట్లో జప్ఫాగాళ్లు ఉన్నారు. రాహుల్ అతి పెద్ద బఫూన్.
+ కోదండరాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ప్రగతి భవన్ గోడలు బద్ధలు కొడతామన్నారు. ప్రగతి భవన్ గోడల సున్నం కూడా గీకలేని పరిస్థితిలో ఉన్నారు.
+ సింహం సింగిల్ గా వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయో నేను చెప్పను
+ మరో 20 పార్టీలు కలుపుకొన్నా ఇబ్బంది లేదు.. అందరిని కలిపి ఉతికి ఆరేస్తాం