Begin typing your search above and press return to search.
రాజీనామా చేసి ఇదే మాట చెప్పి ఉంటే బాగుండేది కేటీఆర్?
By: Tupaki Desk | 12 Jan 2022 5:31 AM GMTఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. రాజకీయ నేతలు అన్న వారు ఎవరైనా తమకు ఎన్ని పదవులు ఉన్నా.. మరిన్ని పదవులు ఉండాలని కోరుకుంటారు. కానీ.. అందుకు భిన్నమైన మాట చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు కేటీఆర్. మంచి వక్తతో పాటు.. సందర్భానికి అనుగుణంగా మాట్లాడే కేటీఆర్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా మారాయని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త క్రీడా విధానం ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన కేటీఆర్.. తాజాగా సిద్ధం చేసిన కొత్త క్రీడా విధానం సమగ్రంగా ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమ విధానం అవుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త క్రీడా పాలసీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ కొత్త క్రీడా విధానానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించాలని.. కేవలం పని.. చదువు మీదనే కాదని.. ఆటలు.. ఫిజికల్ ఫిట్ నెస్.. ఫిజికల్ లిట్రసీ మీదా ఆసక్తి ఉండాలన్నారు. హైదరాబాద్ లోని చాలా స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ లేవన్నారు. ఫారాల్లో కోళ్ల మాదిరిగా పిల్లల్ని కుక్కుతున్నారన్నారు. ఇలా చేస్తే.. డాక్టర్లు.. ఇంజినీర్లు ఎలా తయారవుతారు? ప్రతి పాఠశాలలో ఆటల్ని తప్పనిసరి చేద్దామని.. క్రీడలకు ప్రోత్సాహకాలుగా శాఖల వారీగా కొన్ని నిధులు ఇద్దామన్నారు.
స్టేట్ ఒలింపిక్ కమిటీతో పాటు ఆల్ గేమ్స్ కమిటీలు రాష్ట్రంలో ఉన్నా.. అవేమీ చేస్తున్నాయో ఎవరికీ తెలీదన్న ఆయన.. వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయన్నారు.క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూదని.. రాజకీయ నేతలకు క్రీడా పదవులే ఉండొద్దన్నారు. తాను కూడా తన క్రీడా పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నారు. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని.. జిల్లా యూనిట్ గా కలెక్టర్లు ముఖ్యభూమిక పోషిస్తే.. పీఈటీలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
ప్రైవేటు రంగంలో స్పోర్ట్స్ యూనివర్సిటీలను ప్రోత్సహిద్దామని.. కొరియా మోడల్ను పరిశీలించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం పిల్లలే కాదు.. అందరూ ఫిజికల్ ఫిట్ నెస్ పై అవగామన పెంచుకొని భాగస్వాములను చేసేలా క్రీడా పాలసీ ఉండాలన్నారు. ఒడిశా రాష్ట్రం క్రీడల డెవలప్ మెంట్ కోసం భాగా ప్రయత్నిస్తోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని.. అక్కడకు వెళ్లి ఒడిశా మోడల్ ను పరిశీలించాలన్నారు. అధికారులు ఒడిశాకు వెళ్లి నివేదిక తయారు చేయాలన్నారు.
అహ్మదాబాద్ వంటి నగరాల్లో అక్కడి ప్రభుత్వం క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందని.. వాళ్లు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో హాకీ.. క్రికెట్ వంటి క్రీడల మీద ఫోకస్ పెట్టాలన్నారు. పారా అథ్లెట్స్ పై కూడా కసరత్తు చేయాలని.. ప్రభుత్వం తరఫున సపోర్టు చేస్తామన్నారు.
ఇలా క్రీడలకు సంబంధించి బోలెడన్ని మాటలు చెప్పిన కేటీఆర్.. మాటల్లో పలికిన ఆదర్శాల్ని.. చేతల్లో కూడా చూపిస్తే బాగుండేది. రాజకీయ నేతలు క్రీడలకు.. క్రీడా సంఘాలకు దూరంగా ఉండాలన్న మాట చెప్పి.. తన పదవికి త్వరలో రాజీనామా చేస్తానని చెప్పే కన్నా.. అంతకుముందే రాజీనామా చేసేసి ఈ తరహా మాటలు చెప్పి ఉంటే మరింత ఆదర్శంగా ఉండేదని చెప్పాలి. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. కొత్త క్రీడా విధానం వేళ.. అప్పటికప్పుడు తనకు అనిపించిన మాటల్ని కేటీఆర్ చెప్పారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి కారణం లేకపోలేదు. తన సోదరి కమ్ ఎమ్మెల్సీ కవిత.. కొంత కాలం క్రితం హైదరాబాద్ క్రికెట్ సంఘం మీద కన్నేసినట్లుగా వార్తలు వచ్చాయి. హెచ్ సీఏ మీద తరచూ ఆరోపణలు వస్తున్న వేళ.. దాన్ని గాడిన పెట్టేందుకు తానే రంగంలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
సొంత రాష్ట్రంలో.. సొంత ప్రభుత్వం తమ చేతిలోఉన్నా హైదరాబాద్ క్రికెట్ సంఘం మీద మాత్రం తమ అధిపత్యం లేదన్న విషయాన్ని గుర్తించిన కవిత.. ఆ లోటును తీర్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ విషయాన్ని తారకరాముడు మర్చిపోయారా? తాను వల్లించిన ఆదర్శాలు తన సోదరి ఇష్టాన్ని దెబ్బ తీసేలా ఉందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయి ఇలా మాట్లాడి ఉంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.