Begin typing your search above and press return to search.

కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?

By:  Tupaki Desk   |   1 Oct 2019 11:09 AM GMT
కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?
X
హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ ను గెలిపించే బాధ్యతను టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. అక్టోబర్ 21న నిర్వహించే పోలింగ్ లోపే అక్కడ టీఆర్ ఎస్ ను బలోపేతం చేయడం.. నేతలను సమన్వయం చేసి గెలిచేలా వ్యూహాలు పన్నుతున్నారు.

అయితే తాజాగా హుజూర్ నగర్ ప్రజలను సెంటిమెంట్ తో కొట్టే ఎత్తుగడను కేటీఆర్ అండ్ టీఆర్ ఎస్ అమలు చేస్తోందని సమాచారం. హుజూర్ నగర్ లో ప్రతిపక్ష పార్టీలకు కట్టబెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరం జరిపారని.. ఇప్పటికైనా అధికార పార్టీకి పట్టం కట్టి అభివృద్ధిని చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారు.

తాజాగా కేటీఆర్ కాంగ్రెస్ ను ఎండగట్టే వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ అభివృద్ధిపై ఉత్తమ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఉత్తమ్ ప్రభుత్వానికి ఎలాంటి లేఖ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలిచినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాస్తవాన్ని అక్కడి ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీకి ఓటేయవద్దని పిలుపునిచ్చారు.

ఇలా హుజూర్ నగర్ విషయంలో అభివృద్ధిని చూపెట్టి అక్కడ ప్రజలను గులాబీ పార్టీకి ఓటేసే పరిస్థితిని కల్పించేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్ గెలిస్తే మీకు పథకాలు - అభివృద్ధి దూరమవుతుందని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.