Begin typing your search above and press return to search.

కేసీఆర్ సెలవులిచ్చినా వినట్లేదు.. కేటీఆర్ సీరియస్

By:  Tupaki Desk   |   16 March 2020 11:15 AM GMT
కేసీఆర్ సెలవులిచ్చినా వినట్లేదు.. కేటీఆర్ సీరియస్
X
కరోనా కాటేయడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చినా కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31దాకా సెలవులు ప్రకటించినా మూసివేయాలని కోరినా కొన్ని విద్యాసంస్థలు పెడచెవిన పెట్టాయి.

తాజాగా ఓ విద్యార్థి తల్లి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఇదే విషయంపై ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన మంత్రి వెంటనే ఆస్కూళ్లు, కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సాక్షాత్తూ సీఎం కేసీఆర్ అన్ని విద్యాసంస్థలకు కరోనా కారణంగా సెలవులు ప్రకటించారు. అయితే యథేచ్ఛగా స్కూళ్లు,కాలేజీలు హైదరాబాద్ లో నడుస్తున్నాయని ‘అనన్య చౌదరి’ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యాసంస్థలు అక్రమంగా నడుస్తున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనికి స్పందించిన కేటీఆర్ వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని ఆమెకు బదులిచ్చారు. ర్యాంకుల కోసం కాకుండా విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్యాసంస్థలు మూసివేయాలని కోరారు. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కేటీఆర్ ఆదేశాల తో విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఆ విద్యాసంస్థల లైసెన్స్ రద్దు చేయడానికి సిద్ధమైంది. వాటిపై చర్యలకు ఉపక్రమించింది.