Begin typing your search above and press return to search.
ఆనాడు దయ్యం అన్నడు..నేడు టీడీపీని తోకపార్టీ చేసిండు
By: Tupaki Desk | 3 Dec 2018 1:11 PM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా ఆయన పచ్చపార్టీ అధినేతపై విరుచుకుపడ్డారు. వివిధ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ఆనాడు దయ్యం అన్న మనుషులతోనే దగ్గరైన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఆనాడు దుయ్యబట్టిన పార్టీకే నేడు టీడీపీని తోకపార్టీ చేశారని ఆరోపించారు.
సోనియాగాంధీ దేశానికి పట్టిన దెయ్యం అన్నది చంద్రబాబు కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ``ఆనాడు సోనియాను గాడ్సే అన్నారు. దేశ అభివృద్ధికి వ్యతిరేకమని ఆరోపించలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆనాడు ప్రశ్నించిన నేతలే నేడు కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ.. కేంద్రానికి 30 ఉత్తరాలు రాసింది చంద్రబాబు కాదా? రాహుల్ గాంధీకి టీడీపీని చంద్రబాబు తోకపార్టీని చేసిండు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు మళ్లీ మన ముందుకు జంటగా వస్తున్నారు. కూటమికి ఒక్క ఓటు వేసినా చంద్రబాబుకు వేసినట్లే..? ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి దొరికింది చంద్రబాబు మనిషి కాదా?`` అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక్క టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక నలుగురు ఒక్కటయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ``తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కూటమి నేతలు ఏదిపడితే అది చెప్తరు.. నమ్మొద్దు. ఆలోచించి ఓటువేయండి.. ఆగం కావొద్దు`` అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలో వస్తే సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పెన్షన్లు కూడా రెట్టింపు చేస్తున్నామని, నిరుద్యోగ భృతితో పాటు రైతులకు రూ.1లక్ష రుణమాఫీ చేస్తామని వివరించారు.