Begin typing your search above and press return to search.
సెక్రటేరియట్ లో కేసీఆర్ మనవడి హల్ చల్
By: Tupaki Desk | 13 Feb 2016 5:23 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్ సెక్రటేరియట్ లో హల్ చల్ చేశాడు. ఇప్పటికే కేసీఆర్ పాల్గొనే సభలు - సమావేశాల్లో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఈసారి తాత స్టేట్ లో లేనప్పుడు సెక్రటేరియట్ లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన స్నేహితులను వెంటేసుకుని వచ్చిన హిమాన్షు సెక్రటేరియట్ లోని మంత్రులు - అధికారుల ఛాంబర్లన్నీ చుట్టబెట్టేశాడు. చివరికి తన తాత కేసీఆర్ ఛాంబర్ లోకి వచ్చి అక్కడున్న మైక్ లో కూడా మాట్లాడాడు. ఆ తరువాత తన స్నేహితులందరితో కలిసి వచ్చిన వాహనంలోనే వెనక్కు వెళ్లిపోయాడు. అంతవరకు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం యమ టెన్షన్.
కాగా కేసీఆర్ కొద్దిరోజులుగా మనవడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. హిమాన్షు కూడా చురుగ్గానే వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు ఓసారి వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక గణేశ్ పెండాల్ లోకి ఒంటిరిగానే పూజలు చేసి వెళ్లాడు. అప్పుడు మీడియా ఆయన్ను గుర్తించి అడగ్గా, తన కుటుంబం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం పూజలు చేశానని చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన సెక్రటేరియట్ కు రావడం... అది కూడా స్నేహితులను తీసుకొచ్చి మంత్రుల చాంబర్లు వంటివన్నీ తిరగడంపై విమర్శలొస్తున్నాయి. ఎంత ముఖ్యమంత్రి మనవడైనా సెక్రటేరియట్ లో పిల్ల గ్యాంగ్ ను వెంటేసుకుని వచ్చి సొంత ఇలాకాలా తిరగడం సరికాదని అంటున్నారు.